NTV Telugu Site icon

Bombay High Court: అండం, వీర్య దానం ఇచ్చిన మహిళకు పిల్లలపై చట్టపరమైన హక్కు లేదు..

Sperms

Sperms

అండం, వీర్య దానం ఇచ్చిన మహిళకు పిల్లలపై ఎటువంటి చట్టపరమైన హక్కులు ఉండవని.. జీవ సంబంధమైన తల్లిదండ్రులుగా చెప్పుకోలేరని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. కాగా.. తన ఐదేళ్ల చిన్నారికి సందర్శన హక్కు కల్పించాలని కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ విచారించింది. సరోగసీ ద్వారా పుట్టిన తన కుమార్తెలు అండం దానం చేసిన తన భర్త, చెల్లెలుతో కలిసి జీవిస్తున్నారని ఆ మహిళ తన పిటిషన్‌లో పేర్కొంది.

Bangladesh: హిందూ నేతలని కలిసిన బంగ్లా తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్..

2018లో సరోగసీ మహిళ ద్వారా పిల్లలు పుట్టగా.. 2019లో కవల బాలికలు జన్మించారు. పిటిషనర్ సోదరికి అండాలను దానం చేసినందున.. ఆమెకు జీవసంబంధమైన తల్లిదండ్రులుగా గుర్తించే చట్టబద్ధమైన హక్కు ఉందని పిటిషనర్ భర్త వాదించాడు. కాగా.. 2019లో పిటిషనర్ సోదరి కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. 2019 నుంచి 2021 మార్చి వరకు ఇద్దరు పిల్లలతో కలిసి పిటిషనర్, ఆమె భర్త కలిసే ఉన్నారు. ఆ తరువాత వైవాహిక బంధంలో విభేదాల కారణంగా 2021లో భార్యకు చెప్పకుండా ఇద్దరు పిల్లలతో కలిసి భర్త వేరే ఇంటికి వెళ్లిపోయాడు.

DSC Exam Key: తెలంగాణ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల

అక్కడ రోడ్డు ప్రమాదంతో కుంగుబాటుకు గురైన తన మరదలు.. పిల్లల బాగోగులను చూసుకునేందుకు తనతోనే ఉంటుందని పిటిషనర్ భర్త చెప్పడంతో పిటీషనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె హైకోర్టును ఆశ్రయించగా ఈ తీర్పు వెలువడింది. కాగా.. 2018లో పిల్లలు గర్భం దాల్చినందున సరోగసీ చట్టానికి 2021 సవరణ వర్తించదని.. దానికి బదులుగా ICMR మార్గదర్శకాలు వర్తిస్తాయని హైకోర్టు నియమించిన అమికస్ ధర్మాసనానికి తెలిపారు. కవలలకు జీవసంబంధమైన తల్లిగా చెప్పుకునే హక్కు చెల్లెలికి లేదని హైకోర్టు పేర్కొంది. అందువల్ల ప్రతి వారాంతంలో మూడు గంటల పాటు భార్య కుమార్తెలను కలిసేందుకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది.

Show comments