NTV Telugu Site icon

Human Brain: మానవ మెదడులో ‘‘బ్లాక్ బాక్స్’’.. ఇక్కడే జ్ఞాపకాలు పదిలం..

Hippocampal Ca3 Region

Hippocampal Ca3 Region

Human Brain: చిన్నతనంలో మనం మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలతో గడిపిన క్షణాలు, వారి చెప్పిన కథలు, వారి ఇంట్లో నడయాడిన ప్రాంతాలు, ఆటలు, పాటలు ఎంత కాలమైన మన మెదుడులోని గుర్తుండిపోతాయి. కొన్నేళ్లకు తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు అంతే కొత్తగా మనకు కనిపిస్తుంటాయి. అయితే, ఇవన్నీ మన మెదడులో ఎక్కడ స్టోర్ అవుతాయనేది ఇప్పటికీ మిస్టరీనే. అయితే, ఈ మిస్టరీని ఛేదించడంలో శాస్త్రవేత్తలు కొంత సక్సెస్ అయ్యారు. మెదడు మన జ్ఞాపకాలను దాచి ఉంటే ‘‘బ్లాక్ బాక్స్’’ లాంటి ప్రాంతాన్ని సైంటిస్టులు తెరుస్తున్నారు. ఇది మన మెదడులో జ్ఞాపకాలు దాగి ఉండే ప్రాంతం.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆస్ట్రియా (ISTA) మరియు వియన్నా మెడికల్ యూనివర్శిటీ పరిశోధకులు మెదడులోని హిప్పోకాంపల్ CA3 ప్రాంతాన్ని అర్థం చేసుకోవడంలో పురోగతి సాధించారు. ఇది జ్ఞాపకశక్తి నిల్వకు కీలకమైనది. వీరి అధ్యయనంలో జంతువుల నమూనాలు, ముక్యంగా ఎలుకలతో పోలిస్తే మానవ మెదడు విభిన్న లక్షణాలను ప్రదర్శి్స్తుందని వెల్లడైంది.

Read Also: Doctor commits suicide: జోధ్‌పూర్‌లో డాక్టర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో భార్య పేరు

హిప్పోకాంపస్ నేర్చుకోవడం, అనుబంధ జ్ఞాపకశక్తికి ప్రసిద్ధి చెందినది. సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి, మెమోరీ నమూనాలను పూర్తి చేయడానికి CA3 ప్రాంతం బాధ్యత బాధ్యత వహిస్తుంది. గతంలో మెదడుపై జరిగిన పరిశోధనలు జంతువుల అధ్యయనాలపై ఆధారపడి ఉంది. మానవ-నిర్దిష్ట మెదడు పనితీరుకు సంబంధించి పరిశోధనల్లో గ్యాప్ ఉండేది. అయితే, దీనిని పరిష్కరించడానికి న్యూరోసర్జరీ చేయించుకున్న మూర్ఛ రోగుల నుంచి శాంపిళ్లను పరిశీలించారు. మానవ హిప్పోకాంపస్ కణజాలాన్ని అధ్యయనం చేయడానికి వారికి అవకాశం లభించింది.

శాస్త్రవేత్తల పరిశోధనల్లో మానవ మెదడులోని CA3 ప్రాంతంలో నాడీ కనెక్టివిటీ ఎలుకల కంటే చాలా తక్కువగా ఉందని సూచిస్తున్నాయి. సినాప్సెస్ మరింత ఖచ్చితంగా కనిపించాయి. మానవ హిప్పోకాంపస్ ఎలుకల మెదడు యొక్క పెద్ద వెర్షన్ మాత్రమే కాదని, దాని జ్ఞాపకశక్తి సామర్థ్యాలను పెంచే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉందని ఇది సూచిస్తుంది. మానవ హిప్పోకాంపస్ ఎలుకల మెదడుతో పోలిస్తే పెద్ద వెర్షన్ మాత్రమే కాదని, దాని జ్ఞాపకశక్తి సామర్థ్యాలను పెంచే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉందని ఇది సూచిస్తుంది. సీఏ3, దాని చిన్న సినాప్టిక్ కనెక్టివిటీ జ్ఞాపకాల కోసం నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుందని కనుగొన్నారు. దీని గురించి తెలుసుకునేందుకు మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Show comments