Human Brain: మానవ మెదడులో ‘‘బ్లాక్ బాక్స్’’.. ఇక్కడే జ్ఞాపకాలు పదిలం..
- మానవ మెదడులో ‘‘బ్లాక్ బాక్స్’’..
- ఇక్కడే జ్ఞాపకశక్తి నిల్వ..
- జ్ఞాపకశక్తికి కేరాఫ్‌గా హిప్పోకాంపల్ CA3
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Human Brain: చిన్నతనంలో మనం మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలతో గడిపిన క్షణాలు, వారి చెప్పిన కథలు, వారి ఇంట్లో నడయాడిన ప్రాంతాలు, ఆటలు, పాటలు ఎంత కాలమైన మన మెదుడులోని గుర్తుండిపోతాయి. కొన్నేళ్లకు తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు అంతే కొత్తగా మనకు కనిపిస్తుంటాయి. అయితే, ఇవన్నీ మన మెదడులో ఎక్కడ స్టోర్ అవుతాయనేది ఇప్పటికీ మిస్టరీనే. అయితే, ఈ మిస్టరీని ఛేదించడంలో శాస్త్రవేత్తలు కొంత సక్సెస్ అయ్యారు. మెదడు మన జ్ఞాపకాలను దాచి ఉంటే ‘‘బ్లాక్ బాక్స్’’ లాంటి ప్రాంతాన్ని సైంటిస్టులు తెరుస్తున్నారు. ఇది మన మెదడులో జ్ఞాపకాలు దాగి ఉండే ప్రాంతం.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆస్ట్రియా (ISTA) మరియు వియన్నా మెడికల్ యూనివర్శిటీ పరిశోధకులు మెదడులోని హిప్పోకాంపల్ CA3 ప్రాంతాన్ని అర్థం చేసుకోవడంలో పురోగతి సాధించారు. ఇది జ్ఞాపకశక్తి నిల్వకు కీలకమైనది. వీరి అధ్యయనంలో జంతువుల నమూనాలు, ముక్యంగా ఎలుకలతో పోలిస్తే మానవ మెదడు విభిన్న లక్షణాలను ప్రదర్శి్స్తుందని వెల్లడైంది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Read Also: Doctor commits suicide: జోధ్‌పూర్‌లో డాక్టర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో భార్య పేరు
హిప్పోకాంపస్ నేర్చుకోవడం, అనుబంధ జ్ఞాపకశక్తికి ప్రసిద్ధి చెందినది. సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి, మెమోరీ నమూనాలను పూర్తి చేయడానికి CA3 ప్రాంతం బాధ్యత బాధ్యత వహిస్తుంది. గతంలో మెదడుపై జరిగిన పరిశోధనలు జంతువుల అధ్యయనాలపై ఆధారపడి ఉంది. మానవ-నిర్దిష్ట మెదడు పనితీరుకు సంబంధించి పరిశోధనల్లో గ్యాప్ ఉండేది. అయితే, దీనిని పరిష్కరించడానికి న్యూరోసర్జరీ చేయించుకున్న మూర్ఛ రోగుల నుంచి శాంపిళ్లను పరిశీలించారు. మానవ హిప్పోకాంపస్ కణజాలాన్ని అధ్యయనం చేయడానికి వారికి అవకాశం లభించింది.
శాస్త్రవేత్తల పరిశోధనల్లో మానవ మెదడులోని CA3 ప్రాంతంలో నాడీ కనెక్టివిటీ ఎలుకల కంటే చాలా తక్కువగా ఉందని సూచిస్తున్నాయి. సినాప్సెస్ మరింత ఖచ్చితంగా కనిపించాయి. మానవ హిప్పోకాంపస్ ఎలుకల మెదడు యొక్క పెద్ద వెర్షన్ మాత్రమే కాదని, దాని జ్ఞాపకశక్తి సామర్థ్యాలను పెంచే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉందని ఇది సూచిస్తుంది. మానవ హిప్పోకాంపస్ ఎలుకల మెదడుతో పోలిస్తే పెద్ద వెర్షన్ మాత్రమే కాదని, దాని జ్ఞాపకశక్తి సామర్థ్యాలను పెంచే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉందని ఇది సూచిస్తుంది. సీఏ3, దాని చిన్న సినాప్టిక్ కనెక్టివిటీ జ్ఞాపకాల కోసం నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుందని కనుగొన్నారు. దీని గురించి తెలుసుకునేందుకు మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!