Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒక బైక్ కారును వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకర్ కారు పై నుంచి దూకాడు. ఈ జంపింగ్ చూసి వావ్ అనుకుంటున్నారు. కానీ.. దూకడం వరకు బాగానే ఉన్నా కారు ధ్వంసం కావడంతో కారు ఓనరు లబోదిబోమంటున్నారు. ఈ వీడియోను చూసిన తర్వాత చాలా మంది కామెంట్లు చేశారు. అసలు సంగతేంటంటే సిగ్నల్‌పై నిలబడి ఉన్న కారును వెనుక నుంచి వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఆ వీడియోలో బైక్ డ్రైవర్‌దే తప్పు అని స్పష్టంగా తెలుస్తోంది.
Read Also: Oxygen Plant Blast : ‘బంగ్లా’లోని ఆక్సీజన్ ప్లాంట్లో భారీ పేలుడు.. మృతులను లెక్కిస్తున్న రెస్క్యూ
బైక్ బలంగా ఢీకొనడంతో కారు చాలా వరకు డ్యామేజ్ అయింది. ఈ వీడియోను చాలామంది షేర్ చేశారు. బైక్ డ్రైవర్ సరైన సమయంలో శ్రద్ద పెట్టి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని కొందరు నెటిజన్లు అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఫాస్టుగా వైరల్ అవుతున్న వీడియో ఇది.. దీనిపై నెటిజన్లు అంత దూరంలో ఉన్న కారును కూడా గుర్తించలేదా అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.