Ram Charan : కొరియోగ్రాఫర్ గా రామ్ చరణ్.. ఏ పాటకు డాన్స్ చేసాడంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా పై మెగాభిమానుల్లో భారీ హైప్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా.. చికిరి చికిరి సాంగ్ సెన్సేషనల్ చార్ట్ బస్టర్ అయింది. యూట్యూబ్‌లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ పాటలో చరణ్ వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాను షేక్ చేసింది. బ్యాట్ పట్టుకొని చరణ్ చేసిన స్టెప్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. అయితే, లేటెస్ట్‌గా ఈ హుక్ స్టెప్‌ను చరణ్ కంపోజ్ చేశాడనే న్యూస్ బయటికి రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Also Read : Funky Oversees Review : ఫంకీ ఓవర్సీస్ రివ్యూ.. విశ్వక్ ఖాతాలో మరొక ప్లాప్?
Also Read
- Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
- Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
- PCB: కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్..
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. దీంతో.. ఆయనే హుక్ స్టెప్ కంపోజ్ చేశారని అనుకున్నారు. కానీ, తాజాగా ఓ డ్యాన్స్ షోలో జానీ మాస్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ‘చికిరి చికిరి’ హుక్ స్టెప్ వెనుక రామ్ చరణ్ ఉన్నాడని తెలిపారు. తాను కూర్చుని లేచే స్టెప్ డిజైన్ చేశానని, కానీ క్రికెట్ బ్యాట్ స్టెప్ మాత్రం చరణ్ ఐడియా అని జానీ మాస్టర్ వెల్లడించారు. కానీ ఎప్పుడూ ఆయన ఆ క్రెడిట్ తీసుకోరు.. మాకే ఇచ్చేస్తారని అన్నారు. ఎందుకంటే.. ఐడియా తనదైన.. దాన్ని ఇంకా బెటర్ చేసి.. ఇది వర్క్ అవుతుందని నమ్మినందుకు.. ఆ క్రెడిట్ మీకే అని చరణ్ అన్నారట. దీంతో.. మెగాభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. చరణ్ ఎంత మంచి డ్యాన్సరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తానే హుక్ స్టెప్ క్రియేట్ చేయడం, అది ఓ రేంజ్‌లో ట్రెండ్ అవడంతో.. సోషల్ మీడియాలో ఆయన పై ప్రశంససలు కురిపిస్తున్నారు. ఏదేమైనా.. మెగా పవర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటదని అంటున్నారు అభిమానులు
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!