NTV Telugu Site icon

Donald Trump Biopic: మొదటి భార్య ఇవానాను రేప్ చేసిన డొనాల్డ్ ట్రంప్‌!

Donald Trump Biopic

Donald Trump Biopic

Issue on Donald Trump Biopic The Apprentice: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది అప్రెంటీస్’. ఈ సినిమా (ప్రీమియర్‌ షో)ను ఇటీవల కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2024లో ప్రదర్శించారు. ఈ చిత్రం ద్వారా ట్రంప్ వ్యక్తిగత జీవితానికి సంబదించిన చాలా విషయాలు బయటపడ్డాయి. ట్రంప్ తన మొదటి భార్య ఇవానాపై అత్యాచారం చేసినట్లు సినిమాలో చూపించారు. ఈ సీన్‌పై ట్రంప్‌ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అప్రెంటీస్‌లోని చాలా సన్నివేశాలు కల్పితాలు అని, వాటిని కోర్టులో సవాల్‌ చేస్తామని ట్రంప్‌ వర్గాలు వెల్లడించాయి.

1970, 1980లలో అమెరికా స్థిరాస్తి వ్యాపారంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఎలా ఎదిగారో అప్రెంటీస్‌లో చూపించారు. ట్రంప్ తన దివంగత మాజీ భార్య ఇవానాపై అత్యాచారం చేయడం, ట్రంప్ టవర్స్ కోసం అండర్ వరల్డ్ వ్యక్తులతో ఒప్పందాలు చేసుకోవడం సహా మరిన్నింటిని కూడా ఈ చిత్రంలో చూపించారని ప్రీమియర్‌ చూసిన వాళ్లు వెల్లడించారు. లాయర్‌ రాయ్‌ కోన్‌ పరిచయం తర్వాత ట్రంప్‌ వ్యక్తిత్వం ఎలా మారిందో అని చూపించినట్లు తెలిపారు. అధికారం, డీల్ మేకింగ్‌లో మెలకువలు తెలుసుకున్న ఆయన.. అంతటి కఠినంగా మారారో వివరించారు.

అప్రెంటీస్‌లో కొన్ని సన్నివేశాలు కల్పితమని, మాజీ అధ్యక్షుడి ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచార బృందం ఆరోపించింది. దీన్ని ఒక చెత్త చిత్రంగా కొట్టిపారేసిన ప్రచార బృందం.. హాలీవుడ్‌లోని ప్రముఖులు పన్నిన కుట్రగా అభివర్ణించింది. అన్నికంటే మొదటి భార్య ఇవానాను ట్రంప్‌ అత్యాచారం చేసినట్లుగా చూపడం ఇప్పుడు వివాదానికి తెరతీసింది. ‘ది అప్రెంటీస్ డొనాల్డ్‌ ట్రంప్‌ నిజ జీవితానికి దగ్గరగా లేదు. ఇందులో చూపించినవన్నీ కల్పితాలు. మేము సినిమాపై దావా వేస్తున్నాం. యూఎస్‌లో సినిమా విడుదల కాకుండా చూస్తాం’ అని ట్రంప్ ప్రచార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఆరోపణలపై డైరెక్టర్‌ అలీ అబ్బాసీ స్పందించారు. సినిమా చూడకుండా కోర్టులో సవాల్‌ చేయడం సరికాదని, ఈ చిత్రాన్ని చూసి ట్రంప్‌ కచ్చితంగా ఆశ్చర్యపోతారని అన్నారు.

Also Read: Maidaan OTT: ఓటీటీలోకి అజయ్‌ దేవ్‌గణ్‌ ‘మైదాన్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నిజ జీవితంలో విడాకుల ప్రక్రియ కోర్టులో ఉన్న సమయంలో తనపై డొనాల్డ్‌ ట్రంప్‌ అత్యాచారానికి పాల్పడ్డట్లు ఇవానా ఆరోపించారు. ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారు. 2022లో ఆమె మరణించారు. అప్రెంటీస్‌లో ఇవానా పాత్రను మరియా బకలోవా పోషించారు. డొనాల్డ్‌ ట్రంప్ పాత్రలో సెబాస్టియన్ స్టాన్ నటించారు. ట్రంప్ మెంటార్‌, ప్రముఖ న్యాయవాది రాయ్‌ కోన్‌ పాత్రలో జెరెమీ స్ట్రాంగ్‌ కనిపించారు. ఈ చిత్రం యుఎస్, ప్రపంచవ్యాప్తంగా విడుదల తేదీలను ఇంకా ప్రకటించలేదు. శృంగార తారకు అక్రమ నిధుల బదిలీ కేసులో ట్రంప్‌ ప్రస్తుతం కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు.నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో అప్రెంటీస్‌ తెరపైకి రావడం గమనార్హం.

Show comments