Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News The Air Defense System In Lahore Was Destroyed

Operation Sindoor: హెచ్చరించినా వినలేదు.. అందుకే పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాం..

Published Date :May 8, 2025 , 6:43 pm
By RAMAKRISHNA KENCHE
Operation Sindoor: హెచ్చరించినా వినలేదు.. అందుకే పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘ఆపరేషన్ సిందూర్’తో నిరాశ చెందిన పాకిస్థాన్.. భారతదేశంలోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారత సైన్యం ఈ దాడిని తిప్పికొట్టింది. ఈ అంశంపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి సమాచారం ఇచ్చారు. గత 24 గంటల్లో పాకిస్థాన్ సైన్యం భారతదేశాన్ని ఎలా లక్ష్యంగా చేసుకుందో వివరించారు. వారి ఎత్తుగడలు ఏవీ విజయవంతం కాలేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం.. మేము ఏ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు అని వెల్లడించారు. పాకిస్థాన్ మాత్ర భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందన్నారు. ఇలాంటి పని చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాము ఇప్పటికే హెచ్చరించామని స్పష్టం చేశారు. అమాయక ప్రజలను చంపినందుకు పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

READ MORE: RAPO 22: రామ్ సినిమా టైటిల్ ఆరోజే చెప్తారట!

కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. “2025 మే 7/8 రాత్రి, పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో అనేక భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. వారి ప్రతి దాడిని సైనికులు భగ్నం చేశారు. పాకిస్థాన్ దాడికి రుజువు ఆ దేశానికి చెందిన ఆయుధ శిథిలాలు. ఇవి చాలా చోట్ల దొరికాయి. దీనికి ప్రతిగా భారత సైన్యం ఈ ఉదయం పాకిస్థాన్‌లోని అనేక ప్రదేశాలపై దాడి చేసి వారి వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. లాహోర్‌లో వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది.” అని సోఫియా ఖురేషి వెల్లడించారు. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్ రాజౌరి సెక్టార్లలో పాకిస్థాన్ అకస్మాత్తుగా మోర్టార్లు, భారీ ఫిరంగి కాల్పులకు పాల్పడిందని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పిల్లలు సహా 16 మంది అమాయక పౌరులు మరణించారని వెల్లడించారు. ఈ దుర్మార్గపు చర్యకు అనంతరం భారత సైన్యం వెంటనే స్పందించిందని.. పాకిస్థాన్ పోస్టులపై లక్ష్యంగా కాల్పులు జరిపిందని వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Air Defence System
  • Baramulla
  • Civilian Casualties
  • Colonel Sophia Qureshi
  • Cross-Border Attack

తాజావార్తలు

  • Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..

  • Guavas Theft: అమానుషం.. జామకాయలు దొంగిలించిందని చిన్నారిని కొట్టి గొలుసులతో బంధించిన రిటైర్డ్ ఆర్మీ

  • Constable: మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ.. మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన..

  • LPG Shortage: ఇక, LPG కొరతకు చెక్..! చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన సర్కార్..

  • Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions