Site icon NTV Telugu

The 100 : రిలీజ్ కి ముందే అరుదైన ఘనత సాధించిన ‘ది 100’ మూవీ..

Whatsapp Image 2024 05 04 At 10.51.47 Am

Whatsapp Image 2024 05 04 At 10.51.47 Am

మొగలి రేకులు సీరియల్ నటుడు సాగర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సీరియల్‌లో ఆర్కేనాయుడు పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్న సాగర్‌ ఆ సీరియల్ కు గాను బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డును కూడా అందుకున్నాడు. అలాగే సాగర్ పలు సినిమాలలో హీరోగా కూడా నటించి మెప్పించాడు. “సిద్దార్థ్’’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాగర్ ఆ సినిమాతో ఎంతగానో మెప్పించాడు. అలాగే సాగర్ హీరోగా నటించిన షాదీ ముబారక్ మూవీ కమర్షియల్‌గా మంచి వసూళ్లను రాబట్టింది. 2021లో వచ్చిన ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు రిలీజ్ చేశాడు. మళ్ళీ మూడేళ్ల గ్యాప్ తర్వాత సాగర్ ది 100 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ మూవీకి ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడు రిలీజ్ చేశారు.అలాగే ఈ చిత్ర టీజర్ ను ఇటీవల చిరంజీవి తల్లి కొణిదెల అంజనాదేవి గారు రిలీజ్ చేసారు.

క్రైమ్ అంశాలతో ఈ టీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. నగర శివార్లలో జరిగిన కొన్ని సీరియల్ మర్డర్స్‌ను ఇన్వేస్టిగేట్ చేసే ఐపీఎస్ ఆఫీసర్‌గా ఈ టీజర్‌లో సాగర్ కనిపించాడు. ఈ టీజర్‌లో  నిజాయితీ గల ఐపీఎస్ అధికారిగా హీరో క్యారెక్టర్‌ను మేకర్స్ ఎంతో డిఫరెంట్‌గా చూపించారు.ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇదిలా ఉంటే “ది 100” మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే అవార్డు గెలుచుకుంది . ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో “ది 100 “మూవీకి హానరబుల్ జ్యూరీ అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.విడుదలకు ముందే మా చిత్రానికి ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది .

Exit mobile version