The 100 : రిలీజ్ కి ముందే అరుదైన ఘనత సాధించిన ‘ది 100’ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొగలి రేకులు సీరియల్ నటుడు సాగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సీరియల్‌లో ఆర్కేనాయుడు పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్న సాగర్ ఆ సీరియల్ కు గాను బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డును కూడా అందుకున్నాడు. అలాగే సాగర్ పలు సినిమాలలో హీరోగా కూడా నటించి మెప్పించాడు. “సిద్దార్థ్’’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాగర్ ఆ సినిమాతో ఎంతగానో మెప్పించాడు. అలాగే సాగర్ హీరోగా నటించిన షాదీ ముబారక్ మూవీ కమర్షియల్‌గా మంచి వసూళ్లను రాబట్టింది. 2021లో వచ్చిన ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు రిలీజ్ చేశాడు. మళ్ళీ మూడేళ్ల గ్యాప్ తర్వాత సాగర్ ది 100 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ మూవీకి ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడు రిలీజ్ చేశారు.అలాగే ఈ చిత్ర టీజర్ ను ఇటీవల చిరంజీవి తల్లి కొణిదెల అంజనాదేవి గారు రిలీజ్ చేసారు.
క్రైమ్ అంశాలతో ఈ టీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. నగర శివార్లలో జరిగిన కొన్ని సీరియల్ మర్డర్స్‌ను ఇన్వేస్టిగేట్ చేసే ఐపీఎస్ ఆఫీసర్‌గా ఈ టీజర్‌లో సాగర్ కనిపించాడు. ఈ టీజర్‌లో నిజాయితీ గల ఐపీఎస్ అధికారిగా హీరో క్యారెక్టర్‌ను మేకర్స్ ఎంతో డిఫరెంట్‌గా చూపించారు.ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇదిలా ఉంటే “ది 100” మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే అవార్డు గెలుచుకుంది . ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో “ది 100 “మూవీకి హానరబుల్ జ్యూరీ అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.విడుదలకు ముందే మా చిత్రానికి ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది .
Also Read
- 2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
తాజావార్తలు
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!