NTV Telugu Site icon

Thatikonda Rajaiah : అప్పుడు 5 కోట్ల ఆఫర్ ఇచ్చింది కాంగ్రెస్

Thatikonda Rajaiah

Thatikonda Rajaiah

వరంగల్‌లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పుడు అధికారలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని ఆయన అన్నారు. అంతేకాకుండా.. అయితే కాంగ్రెస్ విడకుండా ఉండేందుకు అప్పుడు 5 కోట్ల ఆఫర్ ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన వెల్లడించారు.

Also Read : Naveen Ul Haq: సారీ ట్వీట్‌పై నవీన్ రియాక్షన్.. రిపోర్ట్ చేయమంటూ సూచన

రాజీనామా చేసే ముందు ఆశ పెట్టి కోట్ల రూపాయలు ఇస్తామన్నా ఆ పైసలు కాలు చెప్పుతో సమానం అని రాజీనామా చేశానని ఆయన పేర్కొన్నారు. నేను రాజీనామా చేయకుండా ఉండేందకు బస్వరాజ్ సారయ్యను దూతగా పంపింది కాంగ్రెస్ అని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసుకున్న వారిని చూసి నా మనస్సు చలించి ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచతో సమానం అని రాజీనామా చేశానని రాజయ్య తెలిపారు. స్టేషన్ ఘనపూర్ ప్రజలు నన్ను ఆదరించారని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, నా చర్మం వలచి మీకు చెప్పులు కుట్టించిన మీ రుణం తీర్చుకోలేనని ఆయన అన్నారు. నేను ఇక్కడే పుట్టాను , ఇక్కడే పెరిగాను , ఇక్కడే చదువుకున్నానని, నేను ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల మధ్యలో చస్తే చివరికి నా సమాధి ఉండేది స్టేషన్ ఘనపూర్ లోనే అని ఆయన వ్యాఖ్యానించారు.

Wrestlers Protest: దేశ రాజధానిలో ఉద్రిక్తత.. పార్లమెంట్‌ వైపు దూసుకెళ్లిన రెజ్లర్ల నిర్బంధం