వరంగల్ జిల్లా కరుణాపురంలో కంటతడి పెట్టారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కుమిలిపోతు తన బాధను చెప్పుకుంటు కుప్పకూలారు ఎమ్మెల్యే రాజయ్య. కొందరు రండ రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేస్ టు ఫేస్ రాజకీయాలు చేయండి తాడోపేడో తెలుసుకుందామని రాజయ్య సవాల్ విసిరారు. ఏ సర్వే చూసినా తాను ముందు వరుసలో ఉన్నానని, డైరెక్ట్ గా తనను ఎదుర్కోలేక కొందరు రండ రాజకీయాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు రాజయ్య. ఎవరరెన్ని ఇబ్బందులు పెట్టిన ఫాదర్ కొలంబో ఆశీస్సులతో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానన్నారు.
Also Read : Fake Doctor: డాక్టర్తో డేటింగ్ అనుకుంది.. రెండేళ్ల తర్వాత తెలిసింది
ఎంతో ఆప్యాయంగా తాను మమత, అనురాగాలు పంచి పెడుతూ మహిళల గౌరవాన్ని పెంచే విధంగా మగవారితో సమానంగా రాణించాలని ప్రోత్సహిస్తున్నానని, వాటిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలతోపాటు స్వపక్ష నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన ఆత్మస్థైర్యాన్ని కొల్లగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎవరు ఏం చేసినా భయపడే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. చివరి ఊపిరి ఉన్నంతవరకు ఘనపూర్ నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నాకు దేవుళ్ళు అని ఆయన అన్నారు. ప్రజల మధ్యనే ఉంటా ప్రజల మధ్యనే చస్తానని రాజయ్య వ్యాఖ్యానించారు.
