యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన పాన్ ఇండియన్ సినిమా ”స్పై”. ఈ సినిమా మంచి బజ్ తో ఈరోజు ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది.బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.సుభాస్ చంద్రభోస్ మరణం వెనుక వున్న రహస్యాలను చేదించే స్పై గా నిఖిల్ నటించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా లో యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతాయని సమాచారం.ప్రేక్షకులను యాక్షన్ అంశాల తో థ్రిల్ చేయడానికి ఈ రోజు ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ట్రైలర్ తోనే భారీ అంచనాలను క్రియేట్ చేసింది స్పై సినిమా. భారీ గా అంచనాలు పెరగడం తో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసారు. ఈ రోజు ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అవ్వగా ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్ తో పాజిటివ్ టాక్ వచ్చినట్టు సమాచారం..అక్కడ మంచి ఓపెనింగ్స్ కూడా అందుకున్నట్లు సమాచారం.. ఇండియా లో ఎలాంటి టాక్ అందుకుంటుందో అయితే వేచి చూడాలి..
ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా ఆర్యన్ రాజేష్ కూడా ముఖ్య పాత్రలో నటించాడు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.. ఇక ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించడమే కాకుండా కథను కూడా అందించారు.ఇప్పటికే కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ కొట్టాడు నిఖిల్ ఆ తరువాత 18 పేజెస్ వంటి క్యూట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కమర్షియల్ గా అంతగా మెప్పించలేక పోయింది.ఇదిలా ఉండగా స్పై సినిమా డిజిటల్ ఓటిటి రైట్స్ ను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోసొంతం చేసుకున్నట్టు సమాచారం.థియేటర్స్ రన్ తర్వాత అమెజాన్ లో స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం.