NTV Telugu Site icon

Nayanthara : నయనతార పై కోపంతో రగిలి పోయిన ఆ దర్శకుడు

Nayanthara Parthiban 2pics 1593090600 1685414665

Nayanthara Parthiban 2pics 1593090600 1685414665

నయనతార దక్షిణాది ఇండస్ట్రీలో ఇప్పుడు ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది.హీరోలతో సరిసమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే ఏకైక హీరోయిన్ గా మారింది.. ప్రమోషన్లకు ఇంటర్వ్యూలకు ఆమె దూరంగా ఉంటుందిఅయినా వరుస సినిమాల తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది నయనతార. ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో ఆమె నటిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‏గా తనకంటూ ఓ గుర్తింపు ను సంపాదించుకోవడం కోసం నయనతారచాలా కష్టాలే పడింది. ఎన్నో అవమానాలను,ఒడిదుడుకులను కూడా ఎదుర్కొంది నయనతార.. తమిళ్ స్టార్ హీరో శరత్‌కుమార్ నటించిన అయ్యా తో కోలీవుడ్‌లోకి ఆమె అడుగుపెట్టింది. శరత్ కుమార్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన చంద్రముఖిలో అయితే నటించింది. ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్స్ ను అందుకుంది నయనతార.

ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నయనతారపై డైరెక్టర్ పార్థిబన్ సీరియస్ అయ్యాడని సమాచారం.. ఇకపై ఆమె షూటింగ్ కు రావాల్సిన అవసరం అయితే లేదని చెప్పాడట. ఈ విషయాన్ని పార్థిబన్ స్వయంగా అయితే వెల్లడించారు. డైరెక్టర్ పార్థిబన్ తెరకెక్కించాల్సిన కొడైకుల్ మళై చిత్రంలో ఆమె ను హీరోయిన్ గా సెలక్ట్ చేశారట. అయితే ఈ ఆడిషన్స్ కోసం ఉదయం 8 గంటలకు రమ్మని చెప్పగా.. ఆమె రాలేదని అదే రోజు సాయంత్రం 8 గంటలకు కాల్ చేస్తే.. నిన్న రాత్రి బయలుదేరలేదని ఈరోజు రాత్రి బయలుదేరి బస్సులో వస్తానని ఆమె చెప్పింది. దీంతో కోపంతో ఇక నువ్వు రావొద్దు అని చెప్పానని అన్నారటా పార్థిబన్.ఒకప్పుడు షూటింగ్స్ కోసం బస్సులో ప్రయాణించిన నయనతార ఇప్పుడు లేడీ సూపర్ స్టార్‏గా ఎదగడం నిజంగా చెప్పుకోదగ్గ విషయమన్నారు పార్థిబన్. నయన్ ఎదుగుదల చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు.. ఆమెకు పనిపట్ల అపారమైన గౌరవం ఉన్నాయని అని అన్నారు పార్థిబన్.