Akhanda 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ తో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా “NBK 109 ” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను మేకర్స్ దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం.
Read Also :Sabari : ఓటీటీలోకి వచ్చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ శబరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత బాలయ్య తన ఫేవరేట్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 సినిమాలో నటించనున్నట్లు సమాచారం.వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అఖండ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమాలో థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు సౌండ్ బాక్సులు బద్దలైపోయాయి.ఇదిలా ఉంటే త్వరలోనే అఖండ 2 సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శకుడు బోయపాటి స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తుంది.తాజాగా ఈ సినిమాలో బాలయ్యకు ధీటైన విలన్ వేట మొదలు పెట్టిన బోయపాటి బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.త్వరలోనే ఏఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.