ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం పుష్ప సినిమా కు రెండవ పార్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు లుక్స్ సినిమా పై అంచనాలు బాగా పెంచేసాయి.పుష్ప 2 సినిమా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్ళు సాధించేలా దర్శకుడు సుకుమార్ సినిమాను తెరకెక్కిస్తున్నారని సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.పుష్ప 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తం గా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.పుష్ప 2 సినిమా రేంజ్ ను ఇంకా పెంచేందుకు గాను సినిమా లో భారీ ఎత్తున స్టార్ కాస్టింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం.అంతే కాకుండా ఈ సినిమా పై ఉన్న అంచనాలు ఇంకా పెంచే విధంగా ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో ను తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పుష్ప 2 లో ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.హిందీ లో పుష్ప 2 సినిమా కి భారీ గా బిజినెస్ జరగడానికి అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోను సెలెక్ట్ చేసినట్లు సోషల్ మీడియా లో తెగ వార్తలు వస్తున్నాయి.ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మరోసారి మాస్ బీట్స్ అందించబోతున్నట్లు సమాచారం.ఈ సినిమా లో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తున్న సంగతి తెల్సిందే. మొదటి పార్ట్ లో సమంత ఐటం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు.. రెండవ పార్ట్ లో కూడా అలాంటి మాస్ ఐటమ్ సాంగ్ ఉండనుందని సమాచారం. ఈసారి ఆ సాంగ్ కోసం ఎవరిని సంప్రదిస్తారో వేచి చూడాలి.అలాగే పుష్ప 2 సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటిస్తున్న ఫాహద్ ఫాజిల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలువనుందని సమాచారం.