NTV Telugu Site icon

Prabhas : స్పిరిట్ మూవీలో విలన్ గా ఆ బాలీవుడ్ స్టార్ హీరో..?

Spirit

Spirit

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అయింది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీ గా వున్నారు.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో అదిరిపోయింది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  మేకర్స్ నిర్వహించారు.ఈ ఈవెంట్ కు సంబంధించి ఇతర వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Read Also :Akhanda 2 : అఖండ 2 కోసం బోయపాటి భారీ ప్లాన్..?

ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత ప్రభాస్ యానిమల్ మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాకు “స్పిరిట్” అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు.ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.ప్రస్తుతం బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న సందీప్ ఈ సినిమాను అక్టోబర్ 2024 న ప్రారంభించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తీసుకోనున్నట్లు సమాచారం.ఇటీవలే అక్షయ్ కు స్టోరీ వినిపంచగా బౌండెడ్ స్క్రిప్ట్ తో మరోసారి కలిసి ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.యానిమల్ సినిమాలో విలన్ పాత్రకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ అద్భుతంగా నటించాడు.స్పిరిట్ సినిమాలో కూడా విలన్ పాత్ర హీరో పాత్రను డామినెటే చేసేలా వుంటుందట.అయితే అక్షయ్ కుమార్ కు సందీప్ బౌండెడ్ స్క్రిప్ట్ నచ్చకపోతే అక్షయ్ కుమార్ బదులుగా మరో స్టార్ హీరో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Show comments