టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి యాక్టర్‌గా మారిన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళంలో భారీ విజయం సాధించిన ‘జయ జయ జయ జయ హే’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో తను భిన్నమైన అభిప్రాయంతో ఉన్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Also Read : Vijay Sethupathi : అందుకే హీరో అయ్యా – విజయ్ సేతుపతి
మలయాళ మాతృకతో పోలిస్తే తెలుగు వెర్షన్‌లో క్లైమాక్స్‌ను పూర్తిగా మార్చినట్లు తరుణ్ తెలిపారు. ‘నిజం చెప్పాలంటే ఈ సినిమాలో మార్చిన క్లైమాక్స్ నాకు వ్యక్తిగతంగా నచ్చలేదు. కానీ దర్శకుడు సజీవ్ విజన్ మీద గౌరవంతో ఆ సీన్స్‌లో నటించాను. ఇది ప్రేక్షకుల్లో కచ్చితంగా చర్చకు దారితీస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ఒక రీమేక్ సినిమాలో కీలకమైన క్లైమాక్స్‌ను మార్చడం, అది కూడా హీరోకే నచ్చలేదని ఓపెన్‌గా చెప్పడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బ్రహ్మాజీ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు. మరి ఈ ‘నచ్చని’ క్లైమాక్స్ తెలుగు ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
