Site icon NTV Telugu

Tharun Bhascker: హర్టయిన జర్నలిస్ట్.. లైవ్లో తరుణ్ భాస్కర్ క్షమాపణలు

Tharun Bhascker

Tharun Bhascker

Tharun Bhascker: కలెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బ హీరోయిన్గా రూపొందిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిహీ’. మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ‘జయ జయ జయహే’ సినిమాను ఆధారంగా చేసుకుని, ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ మైక్ అందుకోగానే, తరుణ్ భాస్కర్ “హ్యాపీ క్రిస్మస్” అంటూ పేర్కొన్నారు. దీంతో సదరు జర్నలిస్ట్ “ఇది కరెక్ట్ కాదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

READ ALSO: Sania Mirza: ఈ మహిళా స్టార్ కూడా నిశ్చితార్థం తర్వాతే ‘నో మ్యారేజ్’ డిసిషన్! మీకు తెలుసా..

“గత ఏడాది మీరు ఇలాగే విష్ చేశారు. దానికి ఎన్నో ట్రోల్స్ చేసి, నన్ను టార్గెట్ చేశారు. అది తెలిసి కూడా, ఇప్పుడు మీరు మళ్ళీ అనడం టార్గెట్ చేసినట్లే అనిపిస్తోంది” అంటూ ఆ సీనియర్ జర్నలిస్ట్ లేచి వెళ్ళిపోబోయారు. వెంటనే తరుణ్ భాస్కర్ వెళ్ళి, “అదేమీ లేదు. మీతో ఉన్న చనువు కొద్ది, సరదాగా అన్నానని” అన్నారు. అయినా ఆ సీనియర్ జర్నలిస్టు వినకపోవడంతో, తరుణ్ భాస్కర్ క్షమాపణలు చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘35 చిన్న కథ కాదు’ అనే సినిమా ప్రొడ్యూస్ చేసిన సృజన్ ఈ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సజై అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘35’ సినిమా దర్శకుడు ఈ సినిమాకి సంభాషణలు అందిస్తున్నారు.

READ ALSO: UP: కాటేసిన పోలీసు ప్రేమ.. సూసైడ్ చేసుకున్న ఇన్‌స్పెక్టర్.. వెలుగులోకి సంచలన నిజాలు

Exit mobile version