Thangalaan :తంగలాన్ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన మోస్ట్ ఎక్జయిటింగ్ మూవీ తంగలాన్. స్టార్ డైరెక్టర్ పా రంజిత్ ఈ సినిమాను అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించారు.. ఇప్పటికే విడుదల చేసిన తంగలాన్ గ్లింప్స్ వీడియోతోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. అయితే తంగలాన్ చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుక గా విడుదల చేయాలని నిర్ణయించగా కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది.2024 వేసవిలో తంగలాన్ థియేటర్ల లో సందడి చేయబోతుందని ఇటీవలే వార్తలు రాగా.. దీనిపై మేకర్స్ అధికారిక అప్‌డేట్ అందించారు. ఏప్రిల్ లో తంగలాన్ ను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన విడుదల తేదీపై మాత్రం సస్పెన్స్ పెట్టారు. ఇటీవలే బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథ అంటూ విక్రమ్ తన సైన్యంతో సమరానికి వెళ్తున్న లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఆ లుక్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
ఈ చిత్రంలో మాళవికా మోహనన్ మరియు పార్వతి తిరువొత్తు హీరోయిన్స్గా నటిస్తున్నారు. పశుపతి మరియు డానియెల్ కల్టగిరోన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ మరియు నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తంగలాన్ మేకర్స్ ఇటీవల మాళవికా మోహనన్ లుక్ ను కూడా విడుదల చేసారు..డీగ్లామరైజ్‌డ్ గా కనిపిస్తున్న మాళవిక లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఇప్పటిదాకా గ్లామరస్ పాత్రలకే పరిమితమైన ఈ భామ తంగలాన్‌లో సరికొత్త లుక్ లో కనిపించి ఎంతగానో ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ఏప్రిల్ 5 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ 1 మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీనితో తంగలాన్ కు,దేవర మూవీకి ఏప్రిల్ లో బాక్స్ ఆఫీస్ క్లాష్ జరగనుంది.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
History awaits to be written in blood and gold 🌟👑#ThangalaanFromApril2024#HappyPongal🌾 #HappyMakarSankranti🌞 @Thangalaan @chiyaan @beemji @GnanavelrajaKe #StudioGreen @officialneelam @parvatweets @MalavikaM_ @DanCaltagirone @gvprakash @NehaGnanavel @agrajaofficial… pic.twitter.com/fAEZkmpVp1
— Studio Green (@StudioGreen2) January 15, 2024
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!