NTV Telugu Site icon

Thandel : తండేల్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్.. ‘బుజ్జి తల్లి’ వచ్చేస్తోంది

Thandel

Thandel

Thandel : యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించనున్నారు. నిజ జీవిత కథగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడి తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన కొందరు యువకులు పాక్ నేవీ సిబ్బంది చేత చిక్కి పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

Read Also:Koti Deepotsavam Day-7: కార్తికపూర్ణిమ శుభవేళ స్వర్ణలింగానికి రజత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన

ఆ సమయంలో తన ప్రియురాలు శ్రీకాకుళంలో ఉండడంతో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? చివరికి వారంతా పాకిస్తాన్ జైలు నుంచి ఎలా బయటకు వచ్చారు? లాంటి అంశాలను చాలా నేచురల్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ముందుగా డిసెంబర్ నెల 2024 లో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ సినిమాలు క్యూ కట్టి ఉండడంతో ఈ సినిమాని ఫిబ్రవరి 7న రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. తాజాగా ఫస్ట్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించింది చిత్రయూనిట్. ‘తండేల్’ సినిమాలోని ‘బుజ్జి తల్లి’ అనే పాటను ఈ నెల నవంబర్‌లోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ‘ఇది మీ హృదయాలను తాకే ప్రేమ కెరటంలా ఉంటుంది’ అంటూ ఓ బ్యూటిఫుల్ సాంగ్ పోస్టర్ ను షేర్ చేశారు. ఇందులో సాయి పల్లవి నాగ చైతన్యను ఆప్యాయంగా కౌగిలించుకుని కనిపిస్తోంది. చైతన్య పేస్ కనిపించనప్పటికీ, ఈ ఫొటో ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ బంధాన్ని తెలియజేస్తోంది. ఇది హీరో హీరోయిన్ల మధ్య డీప్ ఎమోషనల్ కనెక్షన్ ను సూచిస్తోంది.

Read Also:CM Revanth Reddy : ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవం నిర్వహించడం గొప్ప యజ్ఞం

‘తండేల్’ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ‘బుజ్జి తల్లి’ సాంగ్ కోసం ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ మెలోడీ ట్యూన్ ని కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 23న నాగచైతన్య బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాకి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. దేవీ ఈ చిత్రానికి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారని, కచ్చితంగా సినిమా మ్యూజికల్ హిట్ అవుతుందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.

Show comments