Thandel : తండేల్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్.. ‘బుజ్జి తల్లి’ వచ్చేస్తోంది
- బుజ్జితల్లి ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన తండేల్ టీం
- చైతూను సాయిపల్లవి కౌగిలించుకున్న ఫోటో రిలీజ్
- 'తండేల్' మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thandel : యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించనున్నారు. నిజ జీవిత కథగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడి తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన కొందరు యువకులు పాక్ నేవీ సిబ్బంది చేత చిక్కి పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఆ సమయంలో తన ప్రియురాలు శ్రీకాకుళంలో ఉండడంతో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? చివరికి వారంతా పాకిస్తాన్ జైలు నుంచి ఎలా బయటకు వచ్చారు? లాంటి అంశాలను చాలా నేచురల్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ముందుగా డిసెంబర్ నెల 2024 లో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ సినిమాలు క్యూ కట్టి ఉండడంతో ఈ సినిమాని ఫిబ్రవరి 7న రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. తాజాగా ఫస్ట్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించింది చిత్రయూనిట్. ‘తండేల్’ సినిమాలోని ‘బుజ్జి తల్లి’ అనే పాటను ఈ నెల నవంబర్‌లోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ‘ఇది మీ హృదయాలను తాకే ప్రేమ కెరటంలా ఉంటుంది’ అంటూ ఓ బ్యూటిఫుల్ సాంగ్ పోస్టర్ ను షేర్ చేశారు. ఇందులో సాయి పల్లవి నాగ చైతన్యను ఆప్యాయంగా కౌగిలించుకుని కనిపిస్తోంది. చైతన్య పేస్ కనిపించనప్పటికీ, ఈ ఫొటో ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ బంధాన్ని తెలియజేస్తోంది. ఇది హీరో హీరోయిన్ల మధ్య డీప్ ఎమోషనల్ కనెక్షన్ ను సూచిస్తోంది.
Read Also:CM Revanth Reddy : ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవం నిర్వహించడం గొప్ప యజ్ఞం
‘తండేల్’ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ‘బుజ్జి తల్లి’ సాంగ్ కోసం ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ మెలోడీ ట్యూన్ ని కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 23న నాగచైతన్య బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాకి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. దేవీ ఈ చిత్రానికి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారని, కచ్చితంగా సినిమా మ్యూజికల్ హిట్ అవుతుందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..