NTV Telugu Site icon

Taman : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి షాకింగ్ నిజం చెప్పిన సింగర్ గీతామాధురి

ొ్లచలయ

ొ్లచలయ

Taman : ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్. బడా నిర్మాతల ఫస్ట్ చాయిస్ అతడు. మంచి మ్యూజిషియన్ గానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా నిరూపించుకున్నారు థమన్. ఈ విషయాన్ని సింగర్ గీతా మాధురి ఇటీవలె వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. క్యాన్సర్‌తో బాధపడుతున్న మ్యూజిషియన్ కుటుంబానికి రూ. 10 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ‘ఆహా’ OTTలో ప్రసారమైన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ కార్యక్రమంలో గాయని గీతా మాధురి ఈ విషయాన్ని వెల్లడించారు. తమన్ గురించి ఎవ్వరికీ తెలియని విషయం చెప్పాలనుకుంటోందంటూ ఆ వివరాలను వెల్లడించింది. ఒక మ్యూజిషియన్ కాన్సర్ రావడంతో వాళ్ళ కుటుంబసభ్యులు కీమో ట్రీట్‌మెంట్ చేయించారు.

Read Also: Akhil Akkineni : అక్కినేని ఇంటి పేరు నాకు వద్దు.. ఆ బరువు మోయాలేకపోతున్నా

ఆ ట్రీట్‌మెంట్ వల్ల ఆ మ్యూజిషియన్ బాడీ మొత్తం కాలిపోయిందట. దీంతో అతనిని హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళిపోదాం అని అనుకుంటే.. హాస్పిటల్ వాళ్ళు డబ్బు కడితే గాని పంపించామన్నారు. ఈ విషయం తెలుసుకున్న థమన్ వెంటనే 10 లక్షలు ఇచ్చినట్లు గీతామాధురి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ కార్యక్రమానికి తమన్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. వేడుకలు, కార్యక్రమాల ద్వారా వచ్చే రెమ్యూనరేషన్‌ను స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తానని థమన్ చెప్పాడు. గుంటూరులో 100 మందితో వృద్ధాశ్రమం నిర్మిస్తున్నామని, వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని తమన్ తెలిపారు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, మహేష్ బాబు ‘#SSMB28’, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’తో పాటు మరికొన్ని సినిమాలతో దూసుకుపోతున్నాడు.