Site icon NTV Telugu

The Greatest of All Time : దళపతి విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?

Whatsapp Image 2024 02 29 At 10.11.55 Pm

Whatsapp Image 2024 02 29 At 10.11.55 Pm

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ హక్కులు రికార్డు మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది.ఆ మొత్తం ఎంత అన్నది వెల్లడి కాకపోయినా.. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ హక్కులు భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం..అయితే ఇప్పటికే పలు తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి .అందులో అల్లు అర్జున్ పుష్ప 2, జూనియర్ ఎన్టీఆర్ దేవర, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరియు సిద్దూ జొన్నలగడ్డ టిల్లూ స్క్వేర్ లాంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలు ఇండియన్ 2, అజిత్ కుమార్ విదా ముయార్చి, శివకార్తికేయన్ అమరన్, విజయ్ సేతుపతి మహారాజా హక్కులను కూడా దక్కించుకుంది.

తాజాగా దళపతి విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ జులై 31న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.ఈ మూవీలో దళపతి విజయ్ డ్యుయల్ రోల్ లో కనిపించనుండటం మరో విశేషం. అందులో ఒక పాత్రలో విజయ్ 18 ఏళ్ల యువకుడిగా కనిపించనున్నాడట.. అతన్ని అలా చూపించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్నట్లు సమాచారం.. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.విజయ్ ఈ మధ్యే రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తర్వాత విజయ్ తన చివరి సినిమా దళపతి 69 చేయనున్నాడు. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య  ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది. వెట్రిమారన్, కార్తీక్ సుబ్బరాజ్ లలో ఒకరు విజయ్ చివరి మూవీని డైరెక్ట్ చేయనున్నారు.

Exit mobile version