NTV Telugu Site icon

Thalapathy Gift to Yogi babu: యోగిబాబుకు విజయ్ క్రికెట్ బ్యాట్ గిప్ట్

Vijay Yogibabu

Vijay Yogibabu

Thalapathy Gift to Yogi babu: తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ దక్కించుకున్న స్టార్ విజయ్ దళపతి. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. బాక్సాఫీసు వద్ద వందకోట్ల కలెక్షన్ సినిమాలతో విజయ్ కెరీర్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈయనకు అభిమానులతో పాటు స్టార్స్ లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. అలాంటి విజయ్ ప్రస్తుతం ఓ తమిళ కమెడియన్ యోగిబాబుకు బహుమతిని అందజేశాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కమెడియన్ యోగిబాబుకు క్రీడలపట్ల ఎంతో మక్కువ. ఈ విషయాన్ని తెలుసుకున్న విజయ్ యోగిబాబు కు సర్ప్రైజ్ గిఫ్ట్ గా హెల్మెట్, బ్యాట్ ను పంపించారట. .వాటిని పెట్టుకుని సోషల్ మీడియా వేదికగా ఫోటో షేర్ చేసి యోగిబాబు తన ఆనందం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఆ క్రికెట్ బ్యాట్ తో యోగిబాబు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: Mahesh-Trivikram: జనవరి నుంచి నాన్ స్టాప్‌గా మహేశ్, త్రివిక్రమ్ సినిమా

విజయ్, యోగిబాబు కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. సర్కార్, బిగిల్ వంటి సినిమాలు రాగా ప్రస్తుతం విజయ్ చేస్తున్న వరిసు సినిమాలో కూడా యోగిబాబు నటిస్తున్నాడు. ప్రెజెంట్ విజయ్ తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమా చేస్తున్నాడు. విజయ్ దళపతి నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూట్ పూర్తి అయ్యింది. దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఖుష్బూ, మీనా, శ్రీకాంత్, జయసుధ, యోగిబాబు, శరత్ కుమార్ వంటి వారు నటిస్తున్నారు.