CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!

Thalapathy Vijay

Thalapathy Vijay

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ‘దళపతి’ విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలనను పరుగులు తీయిస్తున్నారు. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని అనూహ్య విజయం దిశగా నడిపించి, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ముస్లిం లీగ్ భాగస్వామ్యంతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్.. బాధ్యతలు చేపట్టిన వెంటనే సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే విజయ్ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాల నియంత్రించేందుకు కంకణం కట్టుకున్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలు వంటి ప్రార్థనా స్థలాలతో పాటు పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 టాస్మాక్ (Tasmac) మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఈ ప్రాంతాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను వచ్చే రెండు వారాల్లోగా తొలగించాలని అధికారులకు స్పష్టమైన గడువు విధించారు. ప్రస్తుతం తమిళనాడులో మొత్తం 4,765 మద్యం దుకాణాలు ఉండగా, తాజా నిర్ణయంతో ప్రార్థనా స్థలాల వద్ద ఉన్న 276, విద్యాసంస్థల దగ్గర ఉన్న 186, బస్టాండ్ల సమీపంలోని 255 దుకాణాలు మూతపడనున్నాయి. మద్యం ప్రాప్తిని తగ్గించి, సామాజిక సంస్కరణలు తీసుకురావాలన్న లక్ష్యంతో విజయ్ ఈ అడుగు వేశారు. అయితే, రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టాస్మాక్ దుకాణాల మూసివేత వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక ప్రభావం, సంక్షేమ పథకాల అమలుపై చర్చలు మొదలయ్యాయి. కేవలం మద్యం దుకాణాలకే పరిమితం కాకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా విజయ్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ఆమోదించడంతో పాటు, రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రత్యేక ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అలాగే, డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి జిల్లాలో యాంటీ డ్రగ్ యూనిట్లను నెలకొల్పేందుకు నిధులు మంజూరు చేశారు. తంగా కనిపిస్తున్నాయి.