Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Thalapathy Vijay Net Worth Election Affidavit Perambur Dmk Manifesto Coupons

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆస్తి లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Published Date :March 30, 2026 , 8:33 pm
By Shiva Ganesh
Thalapathy Vijay: దళపతి విజయ్ ఆస్తి లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అడుగు వేశారు. సోమవారం చెన్నైలోని పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన సమర్పించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. ఆయనకు రూ.404.58 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. ఇందులో బ్యాంక్ డిపాజిట్లు, వివిధ కంపెనీల్లో పెట్టుబడులతో పాటు విలాసవంతమైన కార్ల వివరాలను పేర్కొన్నారు.

READ ALSO: Interest Rates: SSY, PPF వడ్డీ రేట్లు ఖరారు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏప్రిల్ 1 నుంచి అమలు..

విజయ్ గ్యారేజీలో BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్‌ఫైర్ వంటి అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.237.46 కోట్ల ఆదాయాన్ని ప్రకటించగా, గత ఏడాది (2024-25) రూ.184.53 కోట్ల ఆదాయాన్ని చూపించారు. 2020-21లో ఆయన భార్య ఆదాయం రూ.6.13 లక్షలుగా ఉంది. నామినేషన్ అనంతరం విజయ్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అభ్యర్థులను గెలిపించాలని, ‘విజిల్’ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

డీఎంకే మేనిఫెస్టో..
తమిళనాడులో ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ, అధికార డీఎంకే (DMK) పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రకటించిన ఈ మేనిఫెస్టోలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ఒక భారీ స్కీమ్‌ను ప్రకటించారు. రాష్ట్రంలోని మహిళలకు రూ.8,000 విలువైన ప్రత్యేక కూపన్లను అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ మొత్తాన్ని నేరుగా నగదు రూపంలో ఇస్తే రోజువారీ ఖర్చులకే సరిపోతుందని, అందుకే కూపన్ల రూపంలో ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కూపన్ల ద్వారా మహిళలు తమకు నచ్చిన వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, టెలివిజన్లు లేదా మిక్సర్ల వంటి వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఎంట్రీతో ముక్కోణపు పోటీ నెలకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక పక్క దళపతి ఆస్తుల లెక్కలు.. ఇటు అధికార పార్టీ ప్రకటించిన ఉచిత పథకాల ప్రకటనలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కిందని చెబుతున్నారు.

READ ALSO: Standing Exercises: జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే బెల్లీ ఫ్యాట్‌కు బాయ్ బాయ్ చెప్పిండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • DMK manifesto 2026
  • MK Stalin 8000 Coupon Scheme
  • Perambur Assembly Constituency Vijay
  • Tamil Nadu Assembly elections 2026
  • Thalapathy Vijay Net Worth 2026

తాజావార్తలు

  • Thalapathy Vijay: దళపతి విజయ్ ఆస్తి లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

  • Aishwarya Rajesh: మరో సీనియర్ హీరో సరసన ఐశ్వర్యా రాజేష్?

  • Interest Rates: SSY, PPF వడ్డీ రేట్లు ఖరారు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏప్రిల్ 1 నుంచి అమలు..

  • Vijayashanti : ఉద్యమకారుల హామీలపై విజయశాంతి ఫైర్..

  • Nani : మలయాళ స్టార్లతో నాని క్రేజీ ప్లాన్!

ట్రెండింగ్‌

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • Mobiles Stolen: ఐపీఎల్ మ్యాచ్‌ లో వందలాది మంది మొబైల్స్ చోరీ.. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions