విజయ్ టీవీకే (TVK) పార్టీ పెట్టినప్పుడు, సీఎం కుర్చీ తర్వాత సంగతి, ఎన్ని సీట్లు వస్తాయి అని మాట్లాడుకున్నారు. అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ, పొలిటికల్ గా సెంచరీ దాటి 108 స్థానాల్లో టీవీకే పార్టీ గెలిచేసింది. మరి సినిమాల్లో విజయ్ 1000 కోట్ల సంగతి ఏంటి? చివరి సినిమాతో అయినా ఆ కల తీర్చుకుంటాడా? ఒక రకంగా తెలుగు ఇండస్ట్రీ కంటే తమిళ ఇండస్ట్రీ పద్ధతి. సింగపూర్, మలేషియా, శ్రీలంకలో తమిళ చిత్రాలు భారీ వసూళ్లు రాబడతాయి. ఇక ఓవర్సీస్ లో అదిరిపోయే వసూళ్లు సాధిస్తాయి. కోలీవుడ్ కు మలయాళం, కన్నడ, తెలుగు మార్కెట్ కూడా ఉన్నా, 1000 కోట్ల మార్క్ ఇంతవరకు దాటలేదు. 1000 కోట్ల సినిమా కోసం తంబీలు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నా, ఇది అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కు 500 కోట్లు, 1000 కోట్లు ఎలా ఉంటుందో తెలుగు సినిమాలు చూపించాయి. 500 కోట్లు టచ్ చేసిన తొలి చిత్రంగా బాహుబలి, 1000 కోట్లు, 1500 కోట్లు టచ్ చేసిన ఫస్ట్ మూవీగా బాహుబలి 2 కు ఘనత దక్కింది. తెలుగులో మూడు 1000 కోట్ల సినిమాలు బాహుబలి 2, పుష్ప 2, కల్కి ఉన్నాయి. కన్నడలో కేజీఎఫ్ 2 ఉంటే, తమకు ఒక్క మూవీ కూడా లేదన్న ఫీలింగ్ లో తంబీలు ఉన్నారు. తమిళంలో 1000 కోట్ల క్లబ్ లో చేరే సత్తా రజినీకాంత్, విజయ్ కు ఉంది. విజయ్ కంటే సూపర్ స్టార్ సినిమాలే ఎక్కువ కలెక్ట్ చేశాయి. రజినీకాంత్ 2.0 723 కోట్లు, జైలర్ 606 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. 2.0 ఆరేళ్ల క్రితమే డివైడ్ టాక్ తో 723 కోట్లు కలెక్ట్ చేసింది. రోబోలా హిట్ టాక్ వస్తే 1000 కోట్లు దాటేది. 1000 కోట్ల మార్కుకు 2.0 300 కోట్ల దూరంలో ఆగిపోయింది. రోబో తర్వాత వరుస ఫెయిల్యూర్స్ లో పడిపోయిన రజినీకాంత్, జైలర్ తో హిట్ టాక్ తెచ్చుకున్నా వరల్డ్ వైడ్ 606 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది.
2.0, జైలర్ తర్వాత విజయ్ లియో 600 కోట్ల గ్రాస్ తో కోలీవుడ్ టాప్ త్రీ లో నిలిచింది. గోట్ (GOAT) 450 కోట్లు మాత్రమే తీసుకొచ్చింది. 1000 కోట్లు టచ్ చేసే ఛాన్స్ ఎప్పుడు పడితే అప్పుడు రాదు. విజయ్ కు మాత్రం ఆ అవకాశం కోరలంత (గోరంత) దూరంలో ఉంది. 23న రిలీజ్ అవుతున్న జననాయగన్ తో సత్తా చాటితే, తంబీలకు 1000 కోట్లు ఎలా ఉంటుందో చూపిస్తాడా రాజకీయాల్లోకి వెళ్తూ జననాయగన్ చివరి సినిమాగా ప్రకటించాడు విజయ్. మరి ఈ లాస్ట్ మూవీ 1000 కోట్లు కొల్లగొడుతుందా లేదా అన్న డిస్కషన్స్ కోలీవుడ్ లో ఉన్నాయి. ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయ్యాడు, ఇక నటించేది లేదు. లాస్ట్ మూవీ ఎలా ఉన్నా చూస్తారు. శరతులు వర్తిస్తాయి అన్నట్టు హిట్ టాక్ వస్తేనే జననాయగన్ 1000 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ దక్కుతుంది.
విజయ్ గత సినిమాలతో పోలిస్తే, జననాయగన్ వరల్డ్ వైడ్ 9000 థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. రోజుకు నాలుగు ఆటలే ప్రదర్శించాలన్న ఆంక్షలు లేవు. మరో మూవీ పోటీ లేదు. ఇదే డేట్ కు రావాల్సిన సిగ్మా, 31న రావాల్సిన లోకేష్ కనగరాజ్ డీసీ రిలీజ్ కావడం లేదు. రెండు వారాల పాటు మరో మూవీ లేకపోవడం విజయ్ కు కలిసి రానుంది. ఈ లెక్కలన్నీ విజయ్ ఫ్యాన్స్ ను ఊరిస్తున్నాయి, 1000 కోట్ల మార్క్ టచ్ చేస్తుందన్న ఆశతో ఉన్నారు. ఈ ఏడాది తమిళంలో 1000 కోట్ల వసూళ్లను జననాయగన్ తో పాటు జైలర్ 2 ఊరిస్తోంది. సూర్య వీరభద్రుడు హిట్ అయితే 350 కోట్లు మాత్రమే వచ్చింది. మరో పెద్ద హీరోకు 1000 కోట్లు టచ్ చేసే ఛాన్స్ కనిపించడం లేదు. జైలర్ 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది, జైలర్ కు మించిన టాక్ వస్తే జైలర్ 2 కు ఛాన్స్ ఉంది. మరి తంబీల 1000 కోట్ల డ్రీమ్ ను దళపతి తీరుస్తాడో, సూపర్ స్టార్ తీరుస్తాడో చూద్దాం.

