NTV Telugu Site icon

Thalapathy Vijay : స్టార్ డైరెక్టర్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్న విజయ్ దళపతి..?

Whatsapp Image 2023 07 12 At 5.45.08 Pm

Whatsapp Image 2023 07 12 At 5.45.08 Pm

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో ”లియో” సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను అక్టోబర్ 19న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ త్రిష ఎన్నో ఏళ్ల తరువాత విజయ్ దళపతి సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత విజయ్ తన 68వ విజయ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం లో చేయనున్నట్టు ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.. వెంకట ప్రభు రీసెంట్ గా నాగ చైతన్య తో కస్టడీ సినిమా ను తెరకెక్కించారు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.

మరీ ఈ డైరెక్టర్ విజయ్ దళపతి తో ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమా కు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇక లియో సినిమా షూటింగ్ పూర్తి కావడం తో వెంకట్ ప్రభు సినిమాను కొంత గ్యాప్ తర్వాత స్టార్ట్ చేయనున్నారు విజయ్ కాగా విజయ్ తన 68వ సినిమా తరువాత సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.అయితే విజయ్ దళపతి వెంకట్ ప్రభు సినిమా తరువాత స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇది పొలిటికల్ డ్రామా గా తెరకెక్కే అవకాశం ఉందని సమాచారం. ఈ కాంబినేషన్ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.విజయ్ దళపతి శంకర్ దర్శకత్వంలో చివరిగా పదకొండు ఏళ్ల క్రితం స్నేహితుడు సినిమా చేసాడు. మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ కానుందని వార్తలు వస్తున్నాయి.