Site icon NTV Telugu

Thailand Elections: ఆర్మీ పాలనకు చరమగీతం.. థాయ్‌ ఎన్నికల్లో మూవ్ ఫార్వార్డ్ పార్టీ గెలుపు!

Thailand

Thailand

Thailand Elections | థాయిలాండ్ ఎన్నిక‌ల్లో ప్రతిప‌క్ష పార్టీలు భారీ విజ‌యం సాధించాయి. ప‌దేండ్ల క‌న్జర్వేటివ్, ఆర్మీ పాల‌న‌కు థాయిలాండ్ ప్రజ‌లు చ‌రమగీతం పాడారు. మూవ్ ఫార్వార్డ్ పార్టీ, ఫ్యూ థాయ్ పార్టీకి థాయిలాండ్ ప్రజ‌లు భారీ విజ‌యాన్ని క‌ట్టబెట్టారు. దేశంలో సమూల సంస్కరణలకు పిలుపునిచ్చిన ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా థాయ్‌లాండ్ ఓటర్లు అద్భుతమైన తీర్పును అందించారు. దిగువ సభలోని 500 సీట్లలో 151 సీట్లను పిటా లిమ్జారోయెన్‌రాట్‌ నేతృత్వంలోని మూవ్ ఫార్వర్డ్ పార్టీ గెలుచుకోనుంది.

అయితే ప్రతిప‌క్ష పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప‌లువురి మ‌ద్దతు కూడ‌గ‌ట్టాల్సి ఉంది. సెనేట్ స‌భ్యుల మ‌ద్దతు త‌ప్పనిస‌రి. మిల‌ట‌రీ పార్టీల స‌హ‌కారం కూడా అవ‌స‌రం. వీరి మ‌ద్దతుతోనే ప్రధాని కాగ‌ల‌రు. అనంత‌రం త‌మ ప‌రిపాల‌న‌ను ప్రధాని కొనసాగించే అవ‌కాశం ఉంటుంది. అయితే ఏ పార్టీకి వీరి మ‌ద్దతు ఉంటుంద‌నేది తేలాల్సి ఉంది. యువ ఓట‌ర్ల నుంచి లిబ‌ర‌ల్ మూవ్ ఫార్వార్డ్ పార్టీకి పూర్తిస్థాయి మ‌ద్దతు ల‌భించింది. థాయిలాండ్ రాజ‌ధాని బ్యాంకాక్‌లో కూడా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సంద‌ర్భంగా లిబ‌ర‌ల్ మూవ్ ఫార్వార్డ్ పార్టీ ప్రధాని అభ్యర్థి.. మూవ్ ఫార్వార్డ్ లీడ‌ర్ పీటా లిమ్జారోయెన్‌రాట్‌(42) మాట్లాడుతూ.. తాము త‌ప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది సంచ‌ల‌న తీర్పు అని పేర్కొన్నారు. మిల‌ట‌రీ పాల‌న‌కు ప్రజ‌లు చ‌రమగీతం పాడార‌ని తెలిపారు. పాపులిస్ట్ ఫ్యూ థాయ్‌ పార్టీతో తాము పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు.

పాపులిస్ట్ ఫ్యూ థాయ్ పార్టీ కూడా ప్రధాని ప‌ద‌వికి పోటీ ప‌డుతోంది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి పేటోంగ్టార్న్ షిన‌వ‌త్రా కూడా బ‌రిలో ఉన్నారు. ఈ పార్టీ కూడా థాయ్ ఎన్నిక‌ల్లో మంచి మ‌ద్దతును కూడ‌గ‌ట్టుకుంది. 2001 నుంచి 2006 వ‌ర‌కు త‌క్షిన్ షిన‌వ‌త్రా ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. త‌క్షిన్ షిన‌వ‌త్రానే ఫ్యూ థాయ్ పార్టీ అధ్యక్షుడు. 2006 నుంచి 2014 వ‌ర‌కు ఆయ‌న సోదారి ఇంగ్లాక్ షిన‌వ‌త్రా ప్రధాని ప‌ద‌విలో కొన‌సాగారు. త‌క్షిన్‌, ఇంగ్లాక్ థాయ్ సైన్యం నుంచి తీవ్ర వ్యతిరేక‌త ఎదుర్కోవ‌డంతో ప‌ద‌వి నుంచి దిగిపోవాల్సి వ‌చ్చింది. త‌ద‌నంత‌రం ద‌శాబ్ద కాలం పాటు థాయ్‌లో ఆర్మీ పాల‌న కొన‌సాగింది.

Read Also: Molesting Air Hostess: మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

42 ఏళ్ల పిటా లిమ్జారోయెన్‌రాట్‌ ప్రచార బాటలో డైనమిక్ ఉనికిని కలిగి ఉన్నారు. న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్‌లో విద్యాభ్యాసం చేసిన ఆయన పారిశ్రామికవేత్తగా మారడానికి ముందు అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌పై హార్వర్డ్‌లో చదువుకున్నాడు. పిటా లిమ్జారోయెన్‌రాట్‌ తండ్రి ఆయన 25 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యం పిటా తన కుటుంబ వ్యాపార వ్యవహారాలను నిర్వహించడానికి థాయ్‌లాండ్ తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. డెలివరీ యాప్ గ్రాబ్ థాయ్‌లాండ్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారు. 2012లో ఆయన థాయ్ టీవీ నటి చుతిమా టీపనాట్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఏడేళ్ల కుమార్తె ఉంది. 2019లో వారు విడిపోయారు. ఆయన కుమార్తె ప్రచారంలో ప్రముఖంగా కనిపించింది.

Exit mobile version