Site icon NTV Telugu

Security Guard : ఓనర్‎ను కత్తితో పొడిచిన సెక్యూరిటీ.. అలా చేశాడన్న కోపంతో దారుణం

Friend Murder

Friend Murder

Security Guard : చాలా మంది యజమానులు తాము జీతమిస్తున్నానని తన కింద పనిచేసే ఉద్యోగులను చిన్న చూపు చూస్తుంటారు. అది అన్నిసార్లు పనికి రాదు. నిజానికి సబార్డినేట్‌లతో కోపంగా మాట్లాడటం వృత్తిపరంగా వారి పనితీరును దెబ్బతీస్తుంది. దీనికి థాయిలాండ్లో జరిగిన ఘటనే ఉదాహరణ.. ఓ సెక్యూరిటీ గార్డ్ పదేపదే తిడుతున్నాడని మనసులో పెట్టుకుని తన యజమానిని కత్తితో పొడిచాడు.

Read Also: Drugs: సబ్బుల్లో మత్తుపదార్థాలు.. 33.6 కోట్ల విలువైన కొకైన్ సీజ్‌

స్థానిక మీడియా కథనం ప్రకారం.. సావత్ శ్రీరాట్‌చలావ్ (44) అనే వ్యక్తి అరోమ్ బన్నన్ (56) వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆ రోజు చాలా గంటలు తన విధులను సక్రమంగా నిర్వహించాడు.. కానీ ఏదో విషయంపై సెక్యూరిటీ గార్డును మాటలతో దుర్భాషలాడాడు. దానిని సావత్ శ్రీరాట్‌చలావ్ మనసులో పెట్టుకున్నాడు.. అలా అంతకుముందు చాలా సార్లు జరిగింది. ఎంత మంచిగా పనిచేస్తున్నా తన యజమాని పదేపదే తిడుతున్నాడని మనస్తాపానికి గురయ్యే వాడు. ఇంటికి వెళ్లిన అవే ఆలోచనలోకి వచ్చేవి. రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. దీంతో ఇక భరించలేక అరోమ్ బన్నన్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఛాతీపై ఎడమ వైపు కత్తిపోటుకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించాడు.

Read Also: Gun Fire in Palnadu: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. మాజీ ఎంపీపీ ఇంట్లోకి ప్రవేశించి..

అరోమ్ బన్నన్ పై కత్తితో దాడి చేసిన అనంతరం సావత్ శ్రీరాట్‌చలావ్ సైకిల్ పై పరారయ్యాడు. పోలీసులు అతని ఇంటి వద్ద ఆచూకీ తెలిపిన తర్వాత సావత్ శ్రీరాట్‌చలావ్ ను అదుపులోకి తీసుకున్నారు. హత్యా నేరం రుజువైతే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష అనుభవించవచ్చు. విచారణలో పోలీసులు అతడిని విచారించగా ‘నా బాస్‌పై చాలా కాలంగా కోపంగా ఉన్నాను. కొన్నిసార్లు నేను అతని గురించి ఆలోచిస్తూ చాలా ఒత్తిడికి లోనయ్యాను. రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదు. ఎప్పుడూ ఉద్యోగం నుంచి తీసేస్తానని నన్ను బెదిరించేవాడు.. కఠినంగా మాట్లాడేవాడు”. అని అతను చెప్పాడు.

Exit mobile version