Thailand Princess : థాయ్ లాండ్ యువరాణికి గుండెపోటు

Thailand Princes

Thailand Princes

Thailand Princess : థాయ్ లాండ్ యువరాణి బ‌జ్రకితియ‌భ ఖావో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. జాతీయ పార్కులో తన పెంపుడు కుక్కతో పరిగెడుతుండగా ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. గంట పాటు సీపీఆర్ (కార్డియోప‌ల్మొన‌రీ రీస‌సియేష‌న్‌) చేసినా కూడా ఆమెలో స్పంద‌న లేక‌పోవ‌డంతో విష‌యాన్ని వెంట‌నే థాయ్ రాజు వ‌జిరలాంగ్ కార్న్‌కు తెలియ‌జేశారు. వెంటనే హెలికాప్టర్లో కుమార్తెను తీసుకుని నార్త్ బ్యాంకాక్ వెళ్లారని ఓ పత్రిక నివేదించింది. గుండెపోటుతో కుప్పకూలిన యువ‌రాణికి గంట‌కు పైగా సీపీఆర్ చేసినా కూడా ఆమె స్పందించ‌లేదని తెలిపింది. దాంతో, ఆమెకు ఆక్సిజ‌న్ అందించేందుకు ఎక్మో మెషిన్ పెట్టారు. ఆమెను మిలిట‌రీ హెలికాప్టర్లో ఆసుపత్రికి త‌ర‌లించారు అని అండ్రూ మ్యాక్ గ్రెగ‌ర్ మార్షల్ అనే జ‌ర్నలిస్ట్ వెల్లడించాడు. థాయ్‌లాండ్‌కు త‌ర్వాత కాబేయే యువ‌రాణి బ‌జ్రకితియ‌భ గుండెపోటుతో కుప్పకూల‌డంతో రాజ‌కుటుంబం ఆందోళ‌న‌లో ఉంది.