Site icon NTV Telugu

Thailand: థాయిలాండ్‌‌కు వెళ్తున్నారా.. ఇవి లేకపోతే నో ఎంట్రీ జాగ్రత్త!

Thailand

Thailand

Thailand: థాయిలాండ్‌కు వెళ్తున్న ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ దేశం మే 2025 నుంచి తన వీసా విధానాల్లో కీలక మార్పులు అమలు చేస్తుంది. దీంతో ఈ మార్పులు తెలియకుండా దేశంలోకి ప్రవేశిస్తున్న భారతీయులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులందరిపై వాటి ప్రభావం పడుతోంది. దేశంలో వలస నియంత్రణలను కట్టుదిట్టం చేయడం, ప్రవేశ ప్రక్రియను క్లియర్‌గా అమలు చేయడమే థాయ్‌ ప్రభుత్వ ఈ మార్పులను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల నేపథ్యంలో తాజాగా డాన్ ముయాంగ్‌ విమానాశ్రయంలో ఒక విదేశీ పర్యాటకురాలికి ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రవేశం నిరాకరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ ALSO: GCC Warns Iran: ముస్లిం దేశాన్ని హెచ్చరించిన 6 గల్ఫ్ దేశాలు..

ఈ పర్యాటకురాలు ఆన్‌లైన్‌లో పోస్టు చేసిన వీడియోలో “తగినంత నగదు లేదు” అనే కారణంతో తనను దేశంలోకి అనుమతించలేదని చెప్పింది. తాను థాయిలాండ్‌కు తరచూగా వెళ్తానని కానీ ఈసారి డాన్ ముయాంగ్‌ ఇమ్మిగ్రేషన్ అధికారులు తగినంత నగదు లేదు అనే నిబంధన కారణంగా తనను దేశంలోకి ఎంట్రీ ఇవ్వలేదని చెప్పింది. తాను ఇంతకు ముందెన్నో సార్లు థాయిలాండ్‌లోకి ప్రవేశించినప్పటికీ, ఈ నియమం గురించి తాను ఎప్పుడూ వినలేదని ఆమె స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఎంత డబ్బు అవసరమో ఎవరూ చెప్పలేదు. చెప్పి ఉంటే ఏటీఎం నుంచి వెంటనే తీసుకు వచ్చే దానిని” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరో విమానాశ్రయం ద్వారా తిరిగి ప్రయత్నించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులు సూచించారని చెప్పింది. కానీ అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఇతర పర్యాటకులు ఎవరూ కూడా డాన్ ముయాంగ్‌ను దేశంలోకి తమ ఎంట్రీ పాయింట్‌గా ఉపయోగించకుండా ఉండాలని హితవు పలికింది.

ఇంతకీ ఏంటీ ఈ కొత్త నియమం?
వాస్తవానికి ఈ నిబంధన కొత్తది కాదు. థాయిలాండ్‌ అధికారిక ప్రవేశ నియమాల ప్రకారం.. దేశంలోకి ప్రవేశించే విదేశీ పర్యాటకులు తగినంత ఆర్థిక స్తోమత ఉన్నట్లు రుజువు చూపించాలి.

ఒక వ్యక్తికి కనీసం 20,000 థాయ్‌ బాట్

కుటుంబానికి కనీసం 40,000 బాట్

పర్యాటక వీసా కోసం కూడా ఇదే ఆర్థిక రుజువు తప్పనిసరి చేశారు. వీసా మినహాయింపు రూల్ ద్వారా ప్రవేశించినా, ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగితే ఈ నిధుల రుజువు చూపించాలి. అవసరమైతే కాన్సులర్ అధికారులు అదనపు పత్రాలను కూడా కోరవచ్చు.

వీసా ఫీజు, గడువు వివరాలు

ప్రవేశ వీసా ఫీజు: 1,000 బాట్

వీసా చెల్లుబాటు: 60 రోజులు ఉండే అవకాశం

అవసరమైతే బ్యాంకాక్‌ ఇమ్మిగ్రేషన్ బ్యూరోలో పొడిగింపు అవకాశం

అదనంగా, కొన్ని దేశాల పౌరులు థాయిలాండ్‌కు బయలుదేరే ముందు తమ స్వదేశంలోని థాయ్‌ ఎంబసీ లేదా కాన్సులేట్‌లో వీసా కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేయాలని థాయ్‌ MFA సూచిస్తోంది.

ప్రయాణికులకు ముఖ్య సూచనలు

థాయిలాండ్‌ చేరుకునే ముందు కనీసం 20,000 బాట్ నగదు లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్ సిద్ధంగా ఉంచుకోవాలి.

డాక్యుమెంట్లలో లోపాలు ఉండకూడదు.

బయలుదేరే ముందు సమీపంలోని థాయ్‌ ఎంబసీ/కాన్సులేట్‌ వద్ద తాజా వీసా నియమాలు తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలి.

ఎయిర్‌పోర్ట్లలో ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో అధికారుల నిర్ణయం ఫైనల్.

థాయిలాండ్‌లో అమల్లోకి వచ్చిన ఈ కొత్త వీసా, ఇమ్మిగ్రేషన్ నియమాలు ప్రపంచ పర్యాటకులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నియమాలను ముందుగానే తెలుసుకొని ప్రయాణిస్తే ఇలాంటి ఇబ్బందులను తప్పించుకోవచ్చని ట్రావెల్‌ నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO: ICC Fine: పాపం టీమిండియా.. మ్యాచ్ ఫీజులో షాక్ ఇచ్చిన ఐసీసీ

Exit mobile version