Thailand GL Series: థాయిలాండ్ ‘గర్ల్స్ లవ్’ విప్లవం.. ప్రపంచ ఫ్యాన్ కల్చర్‌కు కొత్త నిర్వచనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thailand GL Series: థాయిలాండ్ ప్రపంచ టూరిస్ట్ డెస్టినేషన్ మాత్రమే కాదు.. ఆసియా ఖండంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కల్చరల్ ఎక్స్‌పోర్టర్ గా నిలుస్తుంది. వందల కోట్ల విలువైన ‘గర్ల్స్ లవ్ జిఎల్’ ట్రెండ్ థాయిని ఒక కీలక కేంద్రంగా నిలబెట్టింది. వినోద రంగంలో LGBTQ (ఎల్జిబిటిక్యూ) ప్రాతినిధ్యాన్ని మారుస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ కల్చర్ ను కొత్తగా నిర్వచిస్తోంది. థాయిలాండ్ గర్ల్ లవ్ అనేది థాయి టెలివిజన్ అండ్ ఫిలిమ ఇండస్ట్రీలో ఇద్దరు మహిళల మధ్య శృంగార, భావోద్వేగ సంబంధాలను ప్రధాన అంశంగా చూపే ఒక మీడియా ప్రక్రియ.
Telangana Municipal Results: మున్సిపాలిటీల్లో హస్తం, కారు, కమలం పరిస్థితి ఇదే..
Also Read
ఒక మోడర్న్ కల్చరల్ ట్రెండ్.. బలమైన సాఫ్ట్ పవర్ థాయిలాండ్ లో బాయ్స్ ‘లవ్ బిఎల్’ సిరీస్ లు దశాబ్ధ కాలంగా ప్రాచూర్యంలో ఉన్నప్పటికీ 2022 లో వచ్చిన ‘జిఏపి ద’ సిరీస్ తో ‘గర్ల్స్ లవ్ జిఎల్’ విప్లవం మొదలైంది. ఇది ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఇవి కేవలం ప్రేమ కథలకే పరిమితం కాకుండా.. సామాజిక కుటుంబ వ్యక్తిగతమైన వాస్తవిక అంశాలను కూడా చర్చిస్తాయి. గాప్ ది సిరీస్ 23.5° ద సీక్రెట్ ఆఫ్ యుఎస్ బ్లాంక్ ది సిరీస్ వంటివి తాయ్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో మహిళల మధ్య ప్రేమకు చిరునామాగా నిలిచాయి.
ఆధునిక యువత.. సాంప్రదాయ వివాహ పద్ధతులకు, ఆధునిక యువత సాంప్రదాయ వివాహ పద్ధతులకు తిరోదకాలు ఇచ్చి నచ్చిన భాగస్వాములను ఎంచుకునేందుకు స్వేచ్ఛగా పరుగులు తీస్తున్నారు. 2024 నుండి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే దిశగా థాయిలాండ్ అడుగులు వేయడం, సమాజంలో మీడియాలో ఎలాంటి ప్రేమ కథలకు ఆదరణ పెరగడానికి ఒక ప్రధాన కారణం. ఫలితంగా మూడు నాలుగుేళ్ల క్రితం వరకు ఒక చిన్న విభాగంలో ఉన్న గర్ల్స్ లో పరిశ్రమ ఇప్పుడు వందల కోట్ల పరిశ్రమగా ఎదిగింది.
Jasprit Bumrah: బుమ్రా భలే లక్కీ.. ఇతర ఆటగాళ్లకు లేని సౌలభ్యం, ఎప్పుడు కావాలంటే అప్పుడు!
యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ఈ సిరీస్ లో వివిధ భాషల సబ్‌టైటిల్స్ తో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల చైనా లాటిన్ అమెరికా వంటి దేశాల్లో వీటికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కేవలం ప్రసార హక్కుల ద్వారానే కాకుండా ఫ్యాన్ మీటింగ్స్ బ్రాండ్ ఎండాస్మెంట్లు, మర్చండైజ్ అమ్మకాల ద్వారా ఈ పరిశ్రమ కోట్లాది రూపాయల ఆదాయాన్ని గడిస్తుంది. జిఎల్ సిరీస్ యాక్టర్లు అభిమానులను కలిసేందుకు పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. చైనా, తైవాన్, ఫిలిపీన్స్, జపాన్, సింగపూర్, కంబోడియా అమెరికా దేశాలలో ఫ్యాన్ మీటింగ్‌లకు టికెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి.
ఈ సిరీస్ లకు ఇంత ఆదరణ రావడానికి ప్రధాన కారణం గతంలో ప్రపంచవ్యాప్తంగా లెస్బియన్ సంబంధాలకు చూపించిన విధానం కంటే థాయి జియల్ కథలు కొత్త కోణంలో ఉండడమే. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పలు సిరీస్ లలో లెస్బియన్, గే, బైసెక్షువల్ పాత్రలు ఎక్కువగా విషాదకరమైన ముగింపులతో ముడిపడి ఉంటాయి. లేదా హటాత్తుగా మాయమైపోతూ ఉంటాయి. ఇలాంటి పాత కథన ధోరణిని థాయి జిఎల్ సిరీస్‌లు సంపూర్ణంగా మార్చేసాయి.
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!