Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థాయిలాండ్‌లోని సుంగై గోలోక్‌లోని శాంతిపాప్ స్టేడియంలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక ‘గోలోక్ ఎఫ్ఏ కప్’ టోర్నీలో భాగంగా సామ్ కోల్ట్స్, అబు x నాంగ్ సిరిన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా హఠాత్తుగా మైదానంలో పిడుగు పడింది. ఈ విషాదకర సంఘటనలో సామ్‌కోల్ట్స్ జట్టుకు చెందిన 24 ఏళ్ల యంగ్ ఫుట్‌బాలర్ సొఫ్వాన్ అవాయే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు.
మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగుపడటాన్ని ప్రత్యక్షంగా చూసిన వారందరూ భయాందోళనకు గురయ్యారు. పిడుగు పడిన వెంటనే అవాయే తీవ్రంగా గాయపడి కిందపడిపోయాడు. ఆ సమయంలో నలుపు, తెలుపు రంగుల జెర్సీలు ధరించిన అతని సహచర ఆటగాళ్లు వెంటనే అతని వద్దకు పరిగెత్తి, అతనికి సీపీఆర్ (CPR) అందిస్తూ కాపాడేందుకు ప్రయత్నించారు. అత్యవసర వైద్య సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించి కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో అతను మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ ప్రమాదంలో గాయపడిన 12 మంది ఆటగాళ్లలో ఒక మలేషియా క్రీడాకారుడు కూడా ఉన్నాడని, ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక పోలీస్ చీఫ్ థున్ సిరిఖుంట్ తెలిపారు. మరణించిన వింగర్ సొఫ్వాన్ అవాయే ఇటీవలే థాయ్ థర్డ్-టియర్ క్లబ్ అయిన ‘యాలా ఎఫ్‌సీ’కి సైన్ చేశాడు. అతని హఠాన్మరణం పట్ల యాలా ఎఫ్‌సీ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అతని కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని ప్రకటించింది.
థాయిలాండ్‌లో ఇలాంటి పిడుగుపాటు ప్రమాదాలు జరగడం కొత్తేమీ కాదు. డిసీజ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం.. 2020 నుండి 2024 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 283 మంది పిడుగుపాటుకు గురయ్యారు, వారిలో చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే నెలలోనే లంపాంగ్, ఉథాయ్ థానీ ప్రావిన్సులలో వేర్వేరు ఘటనల్లో పిడుగుపడి గర్భిణి సహా ముగ్గురు మరణించారు. ఇక ఇదే రోజున భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలో కూడా పిడుగులు పడి పొలాల్లో పనిచేస్తున్న 14 మంది వ్యవసాయ కూలీలు మరణించడం గమనార్హం.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..