Thai Drug Dealer : డామిట్ కథ అడ్డం తిరిగింది.. ఎన్ని సర్జరీలు చేయించుకున్న దొరికేశా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thai Drug Dealer : థాయ్ ల్యాండ్ లో ఓ డ్రగ్ డీలర్ ముఖ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని దేశం దాటి పారిపోవాలనుకున్నాడు. కానీ థాయ్ పోలీసులు అతగాడి ప్లాన్ తిప్పికొట్టారు. వివరాల్లోకి వెళితే షహారత్ సవాంగ్జెంగ్ అనే 25ఏళ్ల యువకుడు స్థానికంగా డ్రగ్స్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పలు దేశాల నుంచి ఎండీఎంఏ లేదా ఎక్స్టసీ అనే డ్రగ్స్ దిగుమతి చేసుకుని స్థానికంగా విక్రయిస్తూ ఉండేవాడు. ఈ విషయంలో పలుసార్లు జైలు ఊసలు కూడా లెక్కబెట్టాడు. అయినప్పటికీ మనోడి తీరు మారలేదు. తన దారి తనదే అన్నట్లు షహారత్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పోలీసులను చిత్తు చేస్తూ తప్పించుకుని తిరిగాడు. ఈ క్రమంలోనే ముఖానికి పలుమార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు.
Read Also: Stray Dog Kills Baby: తల్లి పక్క నుంచి పసికందును ఎత్తుకెళ్లి చంపిన కుక్క
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
తన ముఖం పూర్తిగా మారిపోయింది అని నిర్ధారించుకున్నాక షహారత్ తన పేరు, ఐడెంటీటీ అన్నింటినీ మార్చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈమేరకు తన పేరును సియాంగ్ జిమిన్ గా చేంజ్ చేసుకున్నాడు. దక్షిణ కొరియా వెళ్లి సెటిల్ కావాలని చూశాడు. అమ్మాయిని చూసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని భావించాడు. మనం అనుకుంటాం కానీ.. అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది.
Read Also: Crime News: వీడు కొడుకా కసాయా.. తండ్రి హత్యకు సుపారీ.. ఎందుకో తెలుసా?
షహారత్ దక్షిణ కొరియా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈలోగా షహారత్ ఉనికిపై పోలీసులకు సమాచారం అందింది. అతడిపై ఉన్నట్లుండి థాయ్ లాండ్ పోలీసులు మెరుపుదాడి చేశారు. తప్పించుకునేందుకు ఛాన్స్ ఇప్పకుండా షహారత్ ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే షహారత్ రూపం పూర్తిగా మారిపోయినట్లు గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు. పాప్ బ్యాండ్ పై మక్కువతో ఉత్తర కొరియాకు వెళ్లిపోవాలని భావంచిన షహారత్ స్థానికంగా కొరియన్ గానే తనని తాను పరిచయం చేసుకుంటున్నాడని విచారణలో తెలిసింది. కావాలనే షరాహత్ కొరియన్ ముఖకవళికలు కోసం సర్జరీ చేయించుకున్నాడని తెలుసుకుని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!