TGSRTC ఉద్యోగులకు షాక్.. ఆ ఇంక్రిమెంట్ నిలిపివేత..!

  • TGSRTC ఉద్యోగులకు షాక్ నిర్ణయం
  • ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్‌పై ఇచ్చే ఇంక్రిమెంట్ రద్దు
  • స్టెరిలైజేషన్ చేయించుకున్న ఉద్యోగులకు ఇకపై అదనపు జీతం లేదు
  • ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి..
Tgsrtc Recruitment 2026

Tgsrtc Recruitment 2026

TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగులకు సంబంధించి యాజమాన్యం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఉద్యోగులకు ఇప్పటివరకు అందిస్తున్న ప్రత్యేక ప్రోత్సాహక ఇంక్రిమెంట్‌ను (Incentive Increment) రద్దు చేస్తూ అధికారికంగా సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిర్ణయానికి సంబంధించి ఇకపై ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ (స్టెరిలైజేషన్) చేయించుకునే ఉద్యోగులకు లేదా వారి జీవిత భాగస్వాములకు ఇచ్చే అదనపు ఇంక్రిమెంట్ నిలిపివేయబడుతుంది.

Dhurandhar2 : ధురంధర్ 2’ తెలుగు ప్రీమియర్స్ రద్దు.. బుకింగ్స్ ఆపేసిన ‘PVR INOX’

ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని యాజమాన్యం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ బోర్డు వెల్లడించింది. వాస్తవానికి ప్రభుత్వం 2006లోనే ఈ స్కీమ్‌ను రద్దు చేసినప్పటికీ, ఆర్టీసీలో మాత్రం ఇది కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు దీనికి స్వస్తి పలికారు. గతంలో ఇద్దరు లేదా అంతకంటే తక్కువ పిల్లలు ఉన్నప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే “పర్సనల్ పే” (Personal Pay) రూపంలో ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ లభించేది. తాజా ఉత్తర్వుల ప్రకారం కొత్తగా ఆపరేషన్ చేయించుకునే వారికి ఎలాంటి అదనపు జీతపు పెరుగుదల ఉండదు.

Indore: భారీ అగ్ని ప్రమాదం.. బాలికతో పాటు ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి..!

ఇంక్రిమెంట్ రద్దు చేసినప్పటికీ, ఈ ఆపరేషన్ కోసం ఇచ్చే “స్పెషల్ క్యాజువల్ లీవ్” (Special Casual Leave) మాత్రం యథావిధిగా కొనసాగుతుందని సంస్థ తెలిపింది. TGSRTC బోర్డు సమావేశంలో తీసుకున్న తీర్మానం (No.07/2026) ఆధారంగా ఈ మార్పులు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏకరూపత తీసుకురావడంలో భాగంగా, ప్రభుత్వం ఎప్పుడో రద్దు చేసిన ఈ పాత స్కీమ్‌ను ఇప్పుడు ఆర్టీసీలో కూడా అధికారికంగా తొలగించారు.