TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో “i-ALERT” కన్ను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంధన సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రయాణికులు, సిబ్బంది భద్రతను మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక ముందడుగు వేసింది. తన BS-VI బస్సులలో ఆధునిక ‘i-ALERT’ వ్యవస్థను ప్రవేశపెట్టి, దేశంలోనే ఈ సాంకేతికతను వినియోగించిన తొలి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా రికార్డు సృష్టించింది. ఈ వినూత్న టెక్నాలజీ సమర్థవంతమైన వినియోగం ద్వారా సంస్థ ఇప్పటివరకు సుమారు రూ. 36 కోట్ల విలువైన హై-స్పీడ్ డీజిల్‌ను (HSD) ఆదా చేయగా, ప్రతినెలా సగటున రూ. 2 కోట్ల మేర నిర్వహణ వ్యయం తగ్గుతోంది.
‘i-ALERT’ వ్యవస్థ బస్సుల డ్రైవింగ్ విధానాలను నిరంతరం పర్యవేక్షిస్తూ డ్రైవర్ల పనితీరును అంచనా వేస్తుంది. సరైన గేర్ల ఎంపిక, గ్రీన్ బ్యాండ్ RPM పరిధిలో డ్రైవింగ్, అనవసరంగా ఇంజిన్ ఆన్ చేసి ఉంచడం, అతివేగం , ఆకస్మిక బ్రేకుల వాడకం వంటి అంశాలను ఇది ఎప్పటికప్పుడు గమనిస్తుంది. విధి నిర్వహణ అనంతరం డ్రైవర్ నైపుణ్యాలకు గ్రేడింగ్స్ ఇస్తూ, శాస్త్రీయ , ఇంధన పొదుపు డ్రైవింగ్ పద్ధతులను అలవర్చుకునేలా తగిన మార్గదర్శకాలు అందిస్తోంది.
ప్రస్తుతం 1,500 అశోక్ లేలాండ్ BS-VI బస్సులలో ఈ పరికరాలను అమర్చడం ద్వారా రోజుకు 6,603 లీటర్లు, నెలకు 1,98,090 లీటర్ల డీజిల్ ఆదా అవుతోంది. దీనివల్ల వాహన ఉద్గారాలు గణనీయంగా తగ్గి, ఏటా సుమారు 6,170 మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ (CO2) వ్యర్థాలు వాతావరణంలో కలవకుండా నివారించగలుగుతున్నారు.
టీజీఎస్ ఆర్టీసీ సాధించిన ఈ విజయంపై పొరుగు రాష్ట్రాలైన ఏపీఎస్ ఆర్టీసీ, కేఎస్ ఆర్టీసీ అధికారులు ఆసక్తి కనబరుస్తూ, ఈ టెక్నాలజీ పనితీరు వివరాలను కోరారు. ఈ అద్భుత సాంకేతికతను విజయవంతంగా అమలు చేసిన ఇంజనీరింగ్ విభాగాన్ని సంస్థ వీసీ & ఎండీ డాక్టర్ అనిల్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రయాణికులకు మరింత మెరుగైన, సురక్షితమైన సేవలు అందించడమే సంస్థ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Putin Praises India: భారత్‌లో ఇన్ని భాషలా? ఈ వైవిధ్యం అద్భుతం.. పుతిన్ ప్రశంసలు!
- CM Convoy : సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం.. చదర్ఘాట్ బ్రిడ్జి వద్ద అడ్డుపడ్డ ఎద్దు
- BJP MLA Rekha Patra: బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రపై విషప్రయోగం.? పరిస్థితి విషమం..
- Police Band Competition : జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసుల సత్తా.. రజత పతకం కైవసం
తాజావార్తలు
-
TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో “i-ALERT” కన్ను..
-
Meenakshi Chaudhary : “చివరికి ఇదంతా బిజినెస్సే!”.. ఇండస్ట్రీలో వివక్షపై మీనాక్షి చౌదరి సంచలన వ్యాఖ్యలు!
-
Putin Praises India: భారత్‌లో ఇన్ని భాషలా? ఈ వైవిధ్యం అద్భుతం.. పుతిన్ ప్రశంసలు!
-
CM Convoy : సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం.. చదర్ఘాట్ బ్రిడ్జి వద్ద అడ్డుపడ్డ ఎద్దు
-
BJP MLA Rekha Patra: బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రపై విషప్రయోగం.? పరిస్థితి విషమం..
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!