ఐపీఎల్ జోష్ మరింత కిక్కిచ్చేలా క్రికెట్ లవర్స్ కోసం టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాదులో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ప్రేక్షకుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తుంది.. ఐపీఎల్ కు వచ్చే ఫ్యాన్స్ కి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులను వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ఆపరేట్ చేయనున్నట్టు వెల్లడించారు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసి అధికారులు. గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను ఆపరేట్ చేయనున్నట్లు తెలిపారు.
Also Read:Aamir Khan : షారుఖ్, సల్మాన్ నా కెరీర్ ను తొక్కేస్తారనుకున్నా : అమీర్ ఖాన్
ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్న తేదీల్లో ఈ ప్రత్యేక బస్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.. మార్చ్ 27, ఏప్రిల్ 6, ఏప్రిల్ 12, ఏప్రిల్ 23, మే 5, మే 10, మే 20, 21 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లకి ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను అరెంజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.. ప్రధానంగా ఘట్కేసర్, హయత్ నగర్, ఎన్జీవోస్ కాలనీ, ఎల్బీనగర్, కోటి, లక్డీకపూల్, దిల్ షుఖ్ నగర్, మేడ్చల్, కెపిహెచ్బి, మియాపూర్, జేబీఎస్, ఈసీఐఎల్, బోయిన్పల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, బీహెచ్ఈఎల్, వంటి వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం కు స్పెషల్ బస్సులు నడవనున్నాయి.