NTV Telugu Site icon

TGPSC : టీజీపీఎస్సీ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ తుది కీ, ర్యాంకింగ్ జాబితా విడుదల

Tgpsc

Tgpsc

TGPSC : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) వరుసగా ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో, మార్చి 19న ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (సూపర్‌వైజర్‌) ఉద్యోగ రాత పరీక్షల తుది ఫలితాలు ప్రకటించింది.

పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఆధికారిక వెబ్‌సైట్ (www.tspsc.gov.in) ద్వారా చూడవచ్చు. మెరిట్‌ లిస్ట్‌ చెక్‌ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ అందుబాటులో ఉంది. అలాగే, ధ్రువపత్రాల పరిశీలన కోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. టీఎస్‌పీఎస్సీ స్త్రీ & శిశు సంక్షేమ శాఖలో 181 గ్రేడ్-1 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్‌ జారీ చేసింది.

దరఖాస్తు తేదీలు: 2022 సెప్టెంబర్ 8 – 29
అర్హత: 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే
వేతన పరిధి: ₹35,720 – ₹1,04,430

జోన్ల వారీగా ఖాళీలు
కాళేశ్వరం – 26
బాసర – 27
రాజన్న – 29
భద్రాద్రి – 26
యాదాద్రి – 21
చార్మినార్‌ – 21
జోగులాంబ – 31

ఈ పోస్టులకు హోమ్ సైన్స్ / సోషల్ వర్క్ / సోషియాలజీ లో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ / బోటనీ / జువాలజీ & కెమిస్ట్రీ / అప్లైడ్ న్యూట్రిషన్ & పబ్లిక్ హెల్త్ / క్లినికల్ న్యూట్రిషన్ & డైటెటిక్స్ / బయో కెమిస్ట్రీ / ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రోల్ / బయోలాజికల్ కెమిస్ట్రీ వంటి సంబంధిత విభాగాల్లో బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

ఈ ఉద్యోగాలు పూర్తిగా మహిళా అభ్యర్థులకే పరిమితం కావడం విశేషం. స్త్రీ & శిశు సంక్షేమ శాఖలో పని చేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా కనిపిస్తోంది. ఇక అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వెంటనే చెక్‌ చేసుకోవాలి.