TG EAPCET: తెలంగాణ ఎప్‌సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGEAPCET: తెలంగాణ ఉన్నత విద్యామండలి EAPCET (Bi.P.C)–2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. Bi.P.C స్ట్రీమ్ అభ్యర్థులకు B.Pharmacy, Pharm-D, బయో-టెక్నాలజీ, బయో-మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, హెల్ప్‌లైన్ సెంటర్–సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ ప్రక్రియను సెప్టెంబర్ 12 నుంచి 16 వరకు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు జరుగుతుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆప్షన్ల నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు చేపట్టి, సెప్టెంబర్ 18న ఆప్షన్లను ఫ్రీజింగ్ చేస్తారు. తొలి దశ సీట్ల ప్రొవిజనల్ అలాట్మెంట్ను సెప్టెంబర్ 21లోపు ప్రకటిస్తారు. సీటు పొందిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు చెల్లింపుతో పాటు వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను సెప్టెంబర్ 21 నుంచి 22 మధ్య పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇక తొలి దశకు హాజరు కాని అభ్యర్థుల కోసం ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఫైనల్ ఫేజ్‌లో ఆన్లైన్లో సమాచారం నమోదు, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ సెప్టెంబర్ 25న జరుగుతుంది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను సెప్టెంబర్ 26న చేపడతారు. అనంతరం ఆప్షన్ల నమోదు సెప్టెంబర్ 26 నుంచి 27 వరకు ఉంటుంది. తొలి దశలో ఇచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోరు కాబట్టి, ఫైనల్ ఫేజ్‌లో ఆప్షన్లను తప్పనిసరిగా కొత్తగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 27న ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుంది. ఫైనల్ ఫేజ్ సీట్ల ప్రొవిజనల్ అలాట్మెంట్ సెప్టెంబర్ 29లోపు వెల్లడిస్తారు. ఈ ఫేజ్‌లో సీటు పొందినవారు ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను సెప్టెంబర్ 29 నుంచి 30 వరకు పూర్తి చేసుకోవాలి. ఫైనల్ ఫేజ్‌లో సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 1 మధ్య కేటాయించిన కాలేజీలో తప్పనిసరిగా భౌతికంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల జాయినింగ్ వివరాలను కాలేజీలు అక్టోబర్ 2న అప్డేట్ చేయాలి. భౌతిక రిపోర్టింగ్ సమయంలో సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో పాటు ఒరిజినల్ T.C.ని కాలేజీలో అందజేసి, తప్పనిసరిగా రసీదు పొందాలని అధికారులు ఆదేశించారు. ఇక స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు అక్టోబర్ 2లోపు TGEAPCET అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు, తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. అలాగే మెరుగైన కాలేజీ, కోర్సులో సీటు పొందేందుకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకుని, వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు నమోదు చేయాలని అధికారులు సూచించారు.
Also Read
- Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
- FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
- Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!