NTV Telugu Site icon

TG NAB : ఇక క్షణాల్లో డ్రగ్స్ తీసుకున్నారా లేదా తెలిసిపోతుందంతే..

Tgnab

Tgnab

TG NAB : తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరోకు తాజాగా కొత్తగా టెస్ట్ కిట్టులు వచ్చాయి. ఈ కిట్టులతో కేవలం క్షణాల వ్యవధిలోని ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నారా లేదా.. అన్న విషయాన్ని కన్ఫామ్ చేయవచ్చు. అంతేకాకుండా యూరిన్ శాంపిల్ నుండి కూడా ఆ సదరు వ్యక్తి నిషేధిత మాదకద్రవ్యాలను తీసుకున్నాడా లేదా అనేది ఇట్లే తెలిసిపోతుంది. ఎప్పుడైనా రైడింగ్ లలో ఎవరైనా అనుమానితులు దొరికితే అక్కడికక్కడే డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న విషయాన్ని అధికారులు ఈ కొత్త కితుల ద్వారా కన్ఫామ్ చేసుకోవచ్చు. ఇప్పటి ఈ కిట్టులు సాంకేతికంగా రుజువయ్యాయి. ఇందుకు సంబంధించిన రిజల్ట్స్ ను న్యాయస్థానాలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయి. నగరాల్లో లేదా ఎక్కడైనా ప్రైవేట్ పార్టీలలో, పబ్బులలో, ఎవరైనా మనల్ని చూడట్లేదని డ్రగ్స్ తీసుకున్నారా అని ఒకవేళ పోలీస్ చెకింగ్ లో సమయంలో దొరికితే క్షణాలలో ఇట్టే దొరికిపోతారు. కాబట్టి నిషేధిత డ్రగ్స్ కు దూరంగా ఉంటే మన జీవితాలకి చాలా మంచిది.

Delhi Police: వరల్డ్ కప్ కోసం 16 ఏళ్లు వేచి ఉన్నాం..సిగ్నల్ పడితే కాసేపు ఆగలేమా?

ఇక తాజాగా హైదరాబాద్ హైటెక్‌ సిటీ వద్ద ఓ నలుగురు వ్యక్తుల డ్రగ్స్‌ వినియోగదారులను పట్టుకున్నామని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య తెలియచేసారు. ఇక పట్టుబడిన వారి నుంచి ఒకటిన్నర కిలోల గంజాయిని అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు. అరెస్టు అయిన వారిలో సచిన్‌, నవీన్ నాయక్‌, ప్రణీత్‌రెడ్డి, రాహుల్‌ లు ఉన్నారని వీరిపై మాదాపూర్ పోలీసుస్టేషన్‌ లో కేసు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. ఇక మరో నిందితుడు రాజా పరారీలో ఉన్నారని తెలిపారు.

Mithun Reddy: ప్రభుత్వ తీరుపై ఎంపీ మిథున్రెడ్డి ఫైర్.. లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని వెల్లడి..