Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tg High Court Issues Interim Order To Stay Demolition Of Actor Nagarjuna N Convention Center

Nagarjuna Akkineni: నాగార్జునకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలు ఆపాలని కోర్టు ఉత్తర్వులు

Published Date :August 24, 2024 , 2:56 pm
By Mahesh Jakki
  • నాగార్జునకు హైకోర్టులో ఊరట
  • కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున
Nagarjuna Akkineni: నాగార్జునకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలు ఆపాలని కోర్టు ఉత్తర్వులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nagarjuna Akkineni: ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చివేతలపై అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. అక్రమ కట్టడం పేరుతో తన కన్వెన్షన్ సెంటర్ ను ఇవాళ కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ అక్కినేని నాగార్జున హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ జరిపారు. ఈ క్రమంలోనే కూల్చివేతలు ఆపాలని జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నాగార్జునకు తాత్కాలిక ఊరట దక్కినట్లు అయింది.

Read Also: Nagarjuna: ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతలపై హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్..

హైదరాబాద్ మాదాపూర్‏లో ఆయనకు చెందిన ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‏ను శనివారం ఉదయం హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కూల్చివేతలను ఆపాలంటూ నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఊరట లభించింది. గచ్చిబౌలిలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. తమ్మిడి కుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించడం వల్ల అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై అక్కినేని నాగార్జున స్పందిస్తూ చట్టవిరుద్ధంగా చేపట్టిన కూల్చివేతల వ్యవహారం పై కోర్టులోనే తేల్చుకుంటానన్నారు. అన్నట్లుగానే హైకోర్టులో కూల్చివేతలు వెంటనే ఆపాలని పిటిషన్ దాఖలు చేశారు.

ఈ విషయంపై విచారణ జరిపిన జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం కూల్చివేతలపై హైడ్రా అధికారుల నుంచి వివరాలు తీసుకుంది. హైడ్రా అధికారుల వాదనపై సంతృప్తి చెందని ధర్మాసనం వెంటనే కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే కూల్చివేతలపై స్టే ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరించి ఎన్ కన్వెషన్ ను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చేయడం సరికాదన్న నాగార్జున వాదనతో హైకోర్టు ఏకీభవించింది. దీనిపై తదుపరి విచారణను వాయిదా వేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actor Nagarjuna
  • Interim Order
  • N Convention Center
  • Nagarjuna Akkineni
  • telugu news

తాజావార్తలు

  • Biker: శర్వా ‘బైకర్’ జోరు.. తొలి వీకెండ్ లోనే రూ. 18 కోట్ల వసూళ్లు!

  • Paytm New Feature: పేటియం అదిరిపోయే అప్‌డేట్.. కార్డ్ లేకుండానే డబ్బులు! ఎలాగో చూసేయండి..

  • Rakasa: దూసుకుపోతున్న రాకాస.. మూడు రోజుల్లో షాకింగ్ కలెక్షన్స్

  • Big Alert: హైదరాబాద్‌ శివారులో ఇల్లు కొనుగోలు చేసే వారికి బిగ్ అలర్ట్..

  • Instagram Subscription Trend: సబ్‌స్క్రైబర్లకు మాత్రమే.. ఇలా బరితెగిస్తే ఎలా?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions