Site icon NTV Telugu

TFJA: తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ‘ఐ స్క్రీనింగ్’… అద్భుత స్పందన

Tfja Eye Camp

Tfja Eye Camp

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో ఫీనిక్స్ ఫౌండేషన్ మరియు శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 26, శనివారం తెలుగు ఫిలిం చాంబర్‌లో ఉచిత ‘ఐ స్క్రీనింగ్’ హెల్త్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. కార్యక్రమానికి హీరో ప్రియదర్శి, నిర్మాత నాగ వంశీ, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రియదర్శి మరియు నాగ వంశీ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, అవినాష్ చుక్కపల్లి, విశ్వ మోహన్, TFJA అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు రఘు, ప్రధాన కార్యదర్శి వై.జె. రాంబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు.

Allu Arjun Atlee: బన్నీ కోసం ఐదుగురు భామలు?

ఈ హెల్త్ క్యాంప్‌లో ప్రియదర్శి స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆయన కంటి చూపు సరైన స్థితిలో ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ, “TFJA ఆధ్వర్యంలో ఈ హెల్త్ క్యాంప్‌కు రావడం సంతోషంగా ఉంది. జర్నలిస్టుల ఆరోగ్యం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న TFJA, ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర్ ఐ హాస్పిటల్‌కు కృతజ్ఞతలు. అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి” అని అన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఈ క్యాంప్‌లో 100 మందికి పైగా జర్నలిస్టులు మరియు వారి కుటుంబ సభ్యులు ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది.

Exit mobile version