TGTET Exam: నేటి నుంచి ప్రారంభంకానున్న టెట్ పరీక్షలు.. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు
- నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు
- 17 జిల్లాల్లో మొత్తం 92 పరీక్షా కేంద్రాలు
- రెండు పేపర్లకు కలిపి మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGTET Exam: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ పరీక్షలు నేటి నుండి ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 17 జిల్లాల్లో మొత్తం 92 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రోజుకు రెండు సెషన్లుగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. టెట్‌కు రెండు పేపర్లకు కలిపి మొత్తం 2,75,773 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-I కు 94,335 మంది, పేపర్-IIకు 1,81,438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Also Read: Rythu Bharosa: నేడే రైతు భరోసా విధివిధానాలపై సబ్ కమిటీ సమావేశం
Also Read
ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు టెట్ పరీక్షల తొలి సెషన్ జరుగుతుంది. మొదటి సెషన్‌కు అభ్యర్థులను 7.30 గంటల నుండి పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించబడతాయి. రెండో సెషన్‌కు 12.30 గంటల నుండి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారు. రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల తరువాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయబడతాయి. టెట్ మొదటి పేపర్‌కు 94,335 మంది, రెండో పేపర్‌కు 1,81,438 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం రెండు పేపర్లకు కలిపి 2,75,753 మంది అభ్యర్థులు పరీక్షలో పాల్గొననున్నారు. పరీక్ష ఆన్‌లైన్ కంప్యూటర్-బేస్డ్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు,ఇంకా ఇతర నిషేధిత వస్తువులను తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు