NTV Telugu Site icon

TGTET Exam: నేటి నుంచి ప్రారంభంకానున్న టెట్​ పరీక్షలు.. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు

Tet

Tet

TGTET Exam: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ పరీక్షలు నేటి నుండి ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 17 జిల్లాల్లో మొత్తం 92 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రోజుకు రెండు సెషన్లుగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. టెట్‌కు రెండు పేపర్లకు కలిపి మొత్తం 2,75,773 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-I కు 94,335 మంది, పేపర్-IIకు 1,81,438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Also Read: Rythu Bharosa: నేడే రైతు భరోసా విధివిధానాలపై సబ్ కమిటీ సమావేశం

ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు టెట్ పరీక్షల తొలి సెషన్ జరుగుతుంది. మొదటి సెషన్‌కు అభ్యర్థులను 7.30 గంటల నుండి పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించబడతాయి. రెండో సెషన్‌కు 12.30 గంటల నుండి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారు. రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల తరువాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయబడతాయి. టెట్ మొదటి పేపర్‌కు 94,335 మంది, రెండో పేపర్‌కు 1,81,438 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం రెండు పేపర్లకు కలిపి 2,75,753 మంది అభ్యర్థులు పరీక్షలో పాల్గొననున్నారు. పరీక్ష ఆన్‌లైన్ కంప్యూటర్-బేస్డ్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు,ఇంకా ఇతర నిషేధిత వస్తువులను తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.

Show comments