బుధవారం ఉదయం బెంగళూరులో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మరువక ముందే.. మళ్లీ ఉగ్రవాదుల అలజడి మొదలైంది. ముంబై నుంచి అమృత్‌సర్ వెళ్తున్న గోల్డెన్ టెంపుల్ రైలులో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పోలీసు బలగాలు అలర్ట్ అయ్యారు. వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.
Sangareddy Crime: చెల్లిని ప్రేమిస్తున్నాడని.. యువకుడి దారుణ హత్య
ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు.. మధుర రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. రైలు ప్లాట్‌ఫారమ్‌కు చేరుకోగానే.. పోలీసు బలగాలు వెంటనే ప్రతీ బోగీని క్షుణ్ణంగా వెతికారు. ఉగ్రవాదుల జాడ కోసం 10 నిమిషాల పాటు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో చేసేదేమీ లేక రైలును తిరిగి అక్కడి నుంచి పంపించారు. వారిని ఎలాగైనా పట్టుకోవాలని.. అదే రైలులో GRP మరియు RPF బృందం కూడా వెళ్తున్నారు. ఉగ్రవాదుల కోసం పోలీసు బలగాలు ఆ రైలులో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రతీ రైల్వే స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్, బీడీఎస్ బృందాలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.