2019లో జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిన రోజది. దీనిపై పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఇదే అంశంపై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎన్నికల టైంలో ఏమైనా చేయగలదన్నారు. ‘పుల్వామా దాడి ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది, దీనిపై అప్పటి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా ప్రశ్నలు సంధించారు. కాబట్టి తాజాగా కశ్మీర్‌లో ఉగ్రదాడి జరగడం కూడా కొత్తగా ఏం అనిపించలేదు. ఎన్నికల సమయంలో బీజేపీ ఏమైనా చేయగలదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, గత శనివారం పూంచ్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఒక సైనికుడు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు.
READ MORE: Election Commission: ఏడో దశ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..?
కాగా.. జమ్మూ కశ్మీర్‌లో 2019 ఫిబ్రవరిలో 14న పాకిస్థాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డ విషయం తెలిసిందే. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపుర (అవంతిపురా సమీపం)లో ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ముష్కరులు మాటువేసి ఘాతానికి పాల్పడ్డారు. ఈ ఆత్మహుతి దాడిలో పాల్గొన్న కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ కూడా హతమయ్యాడు. పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్.. తన కారును జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు పక్క నుంచి కాన్వాయ్‌కి ఎడమవైపు నుంచి ప్రవేశించాడు. జాతీయ రహదారికి అనుబంధ మార్గం నుంచి అవంతీపొర సమీపంలో లాటూ గుండా అతడు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మరోసారి ఈ దాడిని గుర్తుచేశారు.