Child Abuse : ఓ తల్లి తన మూడేళ్ల చిన్నారితో రైల్లే స్టేషన్ కు వచ్చింది. కాస్త లేట్ కావడంతో రైలు మిస్సయ్యింది. చేసేదేంలేక స్టేషన్లోనే తన చిన్నారితో నిద్రపోయింది. తెలవారడంతో నిద్రిస్తున్న చిన్నారిని కదపకుండా టాయిలెట్ కు వెళ్లింది. తిరిగి వచ్చి చూసే సరికి కూతురు కనిపించలేదు. ఆ తర్వాత ఆ మహిళ చాలా ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.. వారు చుట్టుపక్కల గాలించగా స్టేషన్ వెలుపల ఓ సిమెంట్ బెంచీపై చిన్నారి కనిపించింది. దగ్గరకెళ్లి చూసిన ఆ తల్లికి ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి.
Read Also: Greece Train Crash: గ్రీస్ ట్రైన్ క్రాష్‌లో షాకింగ్ ట్విస్ట్.. డ్రైవర్ అలా చేయాల్సింది కాదు!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పన్వేల్ రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్ పక్కన ఓ మహిళ తన మూడేళ్ల కుమార్తెతో నిద్రిస్తోంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మహిళ టాయిలెట్‌కు వెళ్లింది. చిన్నారి తల్లి వెళ్లడాన్ని చూసిన ఓ వ్యక్తి మూడేళ్ల బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరిగి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. బాలిక కోసం వెతుకులాట ప్రారంభించగా.. రైల్వే స్టేషన్‌లోని పడమటి వైపున ఉన్న సిమెంట్ బెంచీపై బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది. బాలికను ఆమె తల్లి ఆసుపత్రిలో చేర్చింది. ఈ కేసులో జిఆర్‌పి పోక్సో కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.
Read Also:Anand Mahindra – Thar: ఈ వీడియో చూస్తే ఇక ట్రాక్టర్లు కొనరేమో?
సీసీటీవీని పరిశీలించిన తర్వాత, నిందితుడు, చెత్త సేకరించే యువకుడు, తల్లి వద్ద బాలిక లేకపోవడంతో, బాలికను స్టేషన్‌లోని అవతలి వైపుకు తీసుకెళ్లినట్లు తేలింది. అంతేకాదు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని వెలుగులోకి వచ్చింది. నిందితుడి కోసం పన్వెల్ లోహ్ మార్గ్ పోలీసులు అన్ని చోట్లా వెతికారు. సీసీటీవీ సాయంతో విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని జుయినగర్ ప్రాంతంలో పట్టుకున్నారు. నిందితుడికి 30 ఏళ్లు ఉంటాయి. చెత్త ఏరుకుంటూ జీవిస్తున్నాడు. అతను సియోన్-పన్వేల్ హైవేపై కలంబోలి వంతెన కింద ఉంటున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు అతడిని అరెస్టు చేసి బాలలపై వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేశారు.