Site icon NTV Telugu

Kyoro Electric Auto: బడ్జెట్ ధరలో క్యోరో ఎలక్ట్రిక్ ఆటో విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 200KM రేంజ్

Kyoro Electric Auto

Kyoro Electric Auto

ఎలక్ట్రిక్ ఆటోలకు ఆదరణ పెరుగుతోంది. బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో వాహనదారులు వీటి కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. తాజాగా మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ ఆటో రిలీజ్ అయ్యింది. టెర్రా మోటార్స్ తన ఎలక్ట్రిక్ ఆటోను భారత మార్కెట్లో క్యోరో ఎలక్ట్రిక్ ఆటోను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఆటో అద్భుతమైన పనితీరును అందించడమే కాకుండా, ఒకే ఛార్జ్‌పై ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను కూడా అందిస్తుంది. దీనిని యాంటీ-రస్ట్ పూతతో రూపొందించారు. ఏ సీజన్‌లో అయినా తుప్పు పట్టకుండా కాపాడుతుంది. దీనిలో అందించిన మెటల్ ఫ్రంట్ ఫాసియా డ్రైవర్, ప్రయాణీకులకు భద్రతను అందిస్తుంది.

Also Read:KCR: కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. విచారణకు వెళ్లేది ఆ రోజే..?

ఇది ముందు, వెనుక రెండింటిలోనూ హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. ఇది రైడ్‌ను సౌకర్యవంతంగా, సున్నితంగా చేస్తుంది. ఎర్గోనామిక్స్‌కు సరిపోయే విధంగా, ఎక్కువ గంటలు రైడ్‌ను సౌకర్యవంతంగా ఉంచే విధంగా సీటింగ్ అందించారు. క్యోరో 6.5 kW రేటింగ్ పవర్, 8.0 kW పీక్ పవర్ కలిగిన PMSM మోటారును కలిగి ఉంది. ఇది రోడ్లపై గంటకు 55+ కిమీ వేగంతో నడపడానికి వీలు కల్పిస్తుంది. దీనికి IP67 రేటెడ్ మోటారు ఉంది. ఇది వర్షం, దుమ్ము నుంచి సురక్షితంగా ఉంచుతుంది.

Also Read:Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టితో త్రిమెన్ కమిటీ భేటీ.. ఉద్యోగుల సమస్యలపై ఆరా

ఎలక్ట్రిక్ ఆటో క్యోరో 11.7 kWh సామర్థ్యంతో వచ్చే LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీని అమర్చారు. ఇది కేవలం 3 గంటల 15 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది (ARAI సర్టిఫైడ్). దీని బ్యాటరీలో ఇంటెలిజెంట్ సేఫ్టీ అలారం సిస్టమ్ ఉంది. ఇది ఉష్ణోగ్రత 55°C కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అప్రమత్తం చేస్తుంది.

Also Read:Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్ రావుకు నోటీసులు..

క్యోరోలో హైడ్రాలిక్ సెంట్రల్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన రీజెనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంది. ఇది ప్రతి బ్రేక్ అప్లికేషన్‌తో బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. శక్తిని ఆదా చేస్తుంది. మెరుగైన గ్రేడబిలిటీ కోసం ఇది 2-స్పీడ్ గేర్‌బాక్స్‌కి జత చేయబడింది. స్పష్టమైన సమాచారం కోసం డిజిటల్ క్లస్టర్ అందించారు. ఇది LED లైటింగ్‌ను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ ఆటో క్యోరో భారత మార్కెట్లో రూ. 3.66 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదలైంది.

Exit mobile version