NTV Telugu Site icon

TDP: చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్ తీర్పుపై టీడీపీ శ్రేణుల్లో టెన్షన్

Babu House

Babu House

రాజమండ్రిలోని కాతేరు దగ్గర ఉన్న వెంకటాద్రి గార్డెన్స్ లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులతో పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సమావేశం కానున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్లు రాజమండ్రి చేరుకుంటున్నారు. చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్ తీర్పుపై ఉత్కంఠగా బాబు కుటుంబ సభ్యులు & టీడీపీ నేతలు ఎదురు చూస్థున్నారు.

Read Also: Food Poisoning: కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో 80 మంది విద్యార్ధినిలు

అయితే, నారా లోకేష్ ఉన్న క్యాంప్ ప్రాంతానికి తెలుగు దేశం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు వస్తున్నారు. చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ పై కోర్టులో వాదనలు ఏ విధంగా జరుగుతున్నాయని అనే విషయాన్ని ఆయన తెలుసుకుంటున్నారు. టీడీపీ లీగల్ సెల్ సభ్యులతో కోర్టులో జరుగుతున్న పరిమాణాలపై లోకేష్ ఆరా తీశారు. హౌస్ అరెస్ట్ పిటిషన్ కోర్టు డిస్మిస్ చేస్తే లీగల్ ప్రొసీజర్స్ ఏంటి అనే దానిపై అడిగి తెలుసుకుంటున్నారు. ఒక వేళ చంద్రబాబును సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలని అనే దానిపై టీడీపీ వర్గాలు చర్చిస్తున్నాయి.

Read Also: PVR Inox Share : జవాన్ తుపాను 217 నిమిషాల్లో రూ.309 కోట్ల నష్టం

ఇక, ఇప్పటికే నారా లోకేష్ క్యాంప్ లోనే బ్రాహ్మణి, భువనేశ్వరి ఉన్నారు. టీడీపీ నేతలతో లోకేష్ ముఖ్య సమావేశం ములాఖత్ తో పాటు హౌజ్ అరెస్ట్ పిటిషన్ తీర్పు తర్వాత పోలిట్ బ్యూరో మీటింగ్ జరుగనుంది. ములాఖత్ సమయం ఫిక్స్ అయిన తర్వాత తొలుత లోకేష్ క్యాంప్ దగ్గరికి వచ్చి.. అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి వచ్చే అవకాశం ఉంది. మరో వైపు ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరపు లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్ రిపోర్ట్ తీర్పుపై సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు.